అమెరికా అమ్మాయికి గాలం వేసిన బీటెక్ బాబు

ఇంస్టాగ్రామ్ లో అమెరికన్ మైనర్ ను వేధిస్తున్న నిజామాబాద్ ఇంజనీరింగ్ యువకుడు అరెస్ట్ అయ్యాడు. ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపి యువతులతో ప్రొఫెషనల్ చాటింగ్ చేస్తున్న బిటెక్ బాబుని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మాటలలో… దింపి అమ్మాయి అభ్యంతకర ఫోటోలు తీసుకున్న నిజామాబాద్ కి చెందిన సందీప్… ఆమెను వేధించడం మొదలు పెట్టాడు. న్యూడ్ ఫోటో లు పంపాలని బ్లాక్ మెయిల్ కు పాల్పడ్డాడు.

తాను అడిగినంత ఇవ్వకుంటే న్యూడ్ ఫోటో లను సోషల్ మీడియా లో అప్లోడ్ చేస్తా అంటూ బెదిరించడం మొదలు పెట్టాడు. ఇంస్టాగ్రామ్ లో బ్లాక్ చేయడంతో అమ్మాయి ఫోటోలని ఫ్రెండ్స్ కు పంపిన సందీప్… వ్యవహారాన్ని భయపడి తలిదండ్రులకు విషయం చెప్పింది సదరు బాలిక. బాలిక కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేస్ నమోదు చేసిన సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు… బాబుని అరెస్ట్ చేసారు.