చంద్రబాబును సీఎం చేసేందుకే పవన్ కళ్యాణ్ ప్రయత్నం చేస్తున్నారని మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా చూడడమే లక్ష్యమని పవన్ చెప్పాడని, పవన్‌కు తనకంటూ సొంత ఆలోచన లేదని ఆయన వ్యాఖ్యానించారు. ఏపీ మంత్రుల మీద సెటైర్లు వేసిన విషయం పవన్‌కు గుర్తు లేదా? అని సూటిగా ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్ రైతుల గురించి మాట్లాడాటం విచిత్రంగా ఉందని, కౌలు రైతులకు ఈ ప్రభుత్వం చేసిన ప్రయోజనం ఇంత వరకు ఏ ప్రభుత్వమూ చేయలేదన్నారు.
ఇవేవీ పవన్ కళ్యాణ్‌కు కనిపించవు అంటూ ఆయన ఆయన అగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు కోసమే ఉద్భవించిన రాజకీయ పార్టీ జనసేన అని, పవన్‌ను చంద్రబాబు పావుగా వాడుకునే ప్రయత్నం చేస్తున్నారన్నారు. కాపు సామాజిక వర్గం చంద్రబాబుకు వ్యతిరేకంగా ఉందని, ఈ సామాజిక వర్గాన్ని వాడుకోవడానికి పవన్ కళ్యాణ్ చంద్రబాబు ఎరగా వాడుకున్నారని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.