Ram Charan: చిరంజీవి బాటలోనే రామ్ చరణ్..తన సినిమాలపై వరుస లీకు‌లు!

-

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి తనయుడు రామ్ చరణ్..RRR పిక్చర్ తో పాన్ ఇండియా స్టార్ అయిపోయారు. తెలుగు చిత్ర సీమలో తనకంటూ ప్రత్యేక స్థానం ఏర్పరుచుకున్న రామ్ చరణ్..తండ్రికి తగ్గ తనయుడే కాదు..తండ్రిని మించిన తనయుడు అనే పేరు సంపాదించుకుంటున్నారు. తన తండ్రి నడిచిన దారిలోనే వెళ్తున్నారు చరణ్. అయితే, తమాషాగా రామ్ చరణ్ కూడా చిరంజీవి మాదిరిగానే తను నటిస్తున్న సినిమాల్లోని సస్పెన్స్ లను రివీల్ చేస్తుండటం గమనార్హం.

గతంలో ఓ సినిమా ఫంక్షన్ లో చిరంజీవి మాట్లాడుతూ కొరటాల శివతో చేస్తున్న చిత్రం ‘ఆచార్య’ అని టైటిల్ రివీల్ చేసేశారు. ‘రంగస్థలం’ చిత్రంలో ఆది పినిశెట్టి పాత్ర మరణం గురించి చెప్పేశారు. ఇలా వరుసగా లీకులు ఇచ్చారు. రామ్ చరణ్ కూడా అదే బాటలో నడుస్తున్నట్లున్నారు.

RRR సినిమాలో తాను పోలీస్ పాత్ర పోషిస్తున్నట్లు పోలీస్ శాఖ వారు నిర్వహించిన కార్యక్రమంలో రామ్ చరణ్ చెప్పారు. ఇటీవల ‘ఆజాద్ కా అమృత్ మహోత్సవ్’ కార్యక్రమంలో పాల్గొన్న రామ్ చరణ్ ..RC15 సినిమాలో తాను IPS ఆఫీసర్ రోల్ ప్లే చేస్తానని, సినిమా స్టోరిలో భాగంగా IAS ప్రిపేరై పాస్ అవుతానని చెప్పారు.

ఇక తాజాగా తన నెక్స్ట్ ఫిల్మ్ గౌతమ్ తిన్ననూరితో చేయబోయే సినిమా గురించి ఇంట్రెస్టింగ్ న్యూస్ చెప్పారు. ‘జెర్సీ’ ఫేమ్ డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరితో తాను చేయబోయే చిత్రం స్పోర్ట్స్ డ్రామా కాదని, అదొక అద్భుతమైన సబ్జెక్ట్ అని పేర్కొన్నారు. ‘ఆచార్య’ ప్రమోషనల్ ఇంటర్వ్యూలో ఈ విషయం చెప్పారు మెగా పవర్ స్టార్.

Read more RELATED
Recommended to you

Latest news