రాజధాని రైతుల ఆందోళనలు 300వ రోజుకు చేరిన సందర్భంగా….అమరావతి పరిరక్షణ సమితి సంఘీభావ ర్యాలీలు తీసింది. ఈసందర్భంగా మంత్రి బొత్స సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజధాని వికేంద్రీకరణను టీడీపీ పెయిడ్ ఆర్టిస్టులే వ్యతిరేకిస్తున్నారని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. రోడ్ల మీద కనిపించేది వారు మాత్రేననని ఆరోపించారు. స్వచ్ఛందంగా ఉద్యమంలో పాల్గొన్న వారు ఎవరూ లేరని అన్నారాయన. ప్రజల నాడి ఏంటో తమ ప్రభుత్వానికి తెలుసన్న బొత్స… ఆ దిశగానే ముందుకు వెళ్తామని స్పష్టం చేశారు.
అమరావతినే రాజధానిగా కొనసాగించాలంటూ సాగుతున్న ఉద్యమం ప్రారంభమై రేపటికి 300 రోజులు పూర్తవుతోంది. ఈ సందర్భంగా ఏపీలోని గుంటూరు, కృష్ణాతో పాటు మరికొన్ని ప్రాంతాల్లో ర్యాలీలు, నిరసన కార్యక్రమాలు సాగాయి. పలు చోట్ల రైతులు, జెఎసి ఆద్వర్యంలో ధర్నాలు చేపట్టారు. రాజధాని గ్రామాల నుంచి రైతులు పెద్ద ఎత్తున ర్యాలీలో పాల్గొన్నారు.