తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు సిద్దమైంది. ఈ నేపథ్యంలోనే 15 రోజుల పాటు భారత స్వతంత్ర్య వజ్రోత్సవాల కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. అయితే.. ఈ నేపథ్యంలోనే.. రాయపర్తి మండలం ఆరెగూడెంలో 75వ స్వాతంత్ర భారత వజ్రోత్సవ వేడుకల్లో భాగంగా ఫ్రీడమ్ పార్క్ ను ప్రారంభించి మొక్కలు నాటారు పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ.. ఫ్రీడమ్ పార్కుల ఏర్పాటు, దేశభక్తి సినిమాల ప్రదర్శన, ఇంటింటికీ జాతీయ జెండాల పంపిణీ చేస్తున్నామన్నారు.
స్వాతంత్య్ర సమరయోధుల గొప్పదనాన్ని నేటితరానికి తెలియజేయడానికే స్వాతంత్య్ర వజ్రోత్సవ వేడుకలు నిర్వహిస్తున్నామని అన్నారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. 75 ఏండ్ల స్వాతంత్య్రానికి గుర్తుగా ఫ్రీడమ్ పార్కు ఏర్పాటుతో పాటు 75 రకాలకు చెందిన 5,625 మొక్కలను నాటామని మంత్రి ఎర్రబెల్లి తెలిపారు. 15 రోజుల పాటు వజ్రోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహిస్తామని వెల్లడించారు మంత్రి ఎర్రబెల్లి. ప్రజలంతా వజ్రోత్సవ వేడుకల్లో పాల్గొనాలన్నారు మంత్రి ఎర్రబెల్లి.