తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు సిద్దమైంది. ఈ నేపథ్యంలోనే 15 రోజుల పాటు భారత స్వతంత్ర్య వజ్రోత్సవాల కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. అయితే.. సిద్దిపేటలో 75 వ స్వతంత్ర వజ్రోత్సవ వేడుకల్లో భాగంగా రంగనాయకసాగర్ రిజర్వాయర్ దగ్గర ఏర్పాటు చేసిన ఫ్రీడమ్ పార్క్ ను ప్రారంభించారు మంత్రి హరీష్ రావు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. దేశంలో ఎక్కడా లేనివిధంగా మన రాష్ట్రంలో వజ్రోత్సవాలు జరుపుకుంటున్నామన్నారు మంత్రి హరీష్ రావు. జాతీయ జెండాలను ఇవ్వలేము కాగితాలు అతికించుకోండి అంటున్నారని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మంత్రి హరీష్ రావు మండిపడ్డారు.
జాతీయ జెండాలను ఇవ్వలేని పరిస్థితి లో మనం ఉన్నామా అని ప్రశ్నించారు మంత్రి హరీష్ రావు. కిషన్ రెడ్డి మాటలు అవమానకరంగా ఉన్నాయని, జెండాలు ఇవ్వలేని పరిస్థితిలో కేంద్ర ప్రభుత్వం ఉందన్నారు హరీష్ రావు. ఇవ్వాళ కొందరు గాంధీని తిట్టి, గాడ్సేను పొడుగుతున్నారని మండిపడ్డారు హరీష్ రావు. గాంధీని తిట్టిన వారు బీజేపీ పార్టీలో ఎంపీగా ఉన్నారని, దేశ ప్రజలు అన్నిటినీ గమనిస్తున్నారని ఆయన అన్నారు హరీష్ రావు.