పాలకుర్తి నియోజకవర్గం దేవరుప్పుల మండలం మాదాపురం, అప్పిరెడ్డి పల్లె గ్రామాలకు కలిపి పడమటి తండాలో, సింగరాజు పల్లె, నీర్మాల గ్రామాలకు కలిపి సింగరాజు పల్లె తుమ్మ గార్డెన్‌లో వేర్వేరుగా జరిగిన ఆత్మీయ సమ్మేళనాలకు మంత్రి ఎర్రబెల్లి హాజరయ్యారు. అక్కడ మంత్రి ప్రసంగిస్తూ పాలకుర్తిలో ప్రజలు మూడుసార్లు బిడ్డగా భావించి ఎన్నుకున్నారని.. ఈ ఆదరణను మరిచిపోలేనన్నారు. నియోజకవర్గ ప్రజలను కంటికి రెప్పలా కాపాడుకోవడంతో పాటు అన్నిరంగాల్లో అభివృద్ధి చేడయమే తన లక్ష్యమని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలోనే పాలకుర్తిని అన్నిరంగాల్లోనే ఆదర్శంగా నిలుపుతానన్నారు మంత్రి ఎర్రబెల్లి.
ఇతర పార్టీల పాలిత రాష్ట్రాల్లో అమలు చేయని పథకాలను తెలంగాణలో అమలు చేస్తామని ఎన్నికలు, కోట్ల కోసం ప్రజలను మోసం చేయాలని చూస్తున్నారని తీవ్ర ఆగ్రహం వ్యక్తపరిచారు మంత్రి. ఇంతకుముందు రాష్ట్రము లో ఏడుగంటలకు దిక్కులేదని, ఇవాళ 24గంటల కరెంటు ఇస్తున్నామన్నారు ఆయన. విద్యుత్ మోటార్లకు మీటర్లు మిగిస్తామని కేంద్రం చెబితే.. ప్రాణమున్నంత వరకు మీటర్ల పెట్టనివ్వనన్న మహానేత కేసీఆర్ అని పొగిడారు మాంత్రి ఎర్రబెల్లి.