మంత్రి పువ్వాడ, మాజీ ఎంపీ పొంగులేటి మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. జనం బీఆర్‌ఎస్ ను ఇంటికి పంపించటానికి సిద్ధంగా ఉన్నారని, బీఆర్‌ఎస్ ప్రజా ప్రతినిధులకు నిద్ర పట్టడంలేదని పొంగులేటి వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈనేపథ్యంలో మంత్రి పువ్వాడ స్పందించారు. మాజీ ఎంపీ పొంగులేటిపై మంత్రి పువ్వాడ సంచలన వ్యాఖ్యలు చేశారు. పొంగులేటి కాంగ్రెస్ లోకి వెళ్తున్నారని కీలక వ్యాఖ్యలు చేశారు.
‘బిడ్డా.. నీ దగ్గర సబ్ కాంట్రాక్ట్ చేసి నష్టపోయిన వాళ్ళ చిట్టా చాలా పెద్దగా ఉంది.. వాళ్లంతా నీకు వచ్చే రోజుల్లో స్వాగతం చెప్పబోతున్నారు. నువ్వు ఇంకా ఎన్ని రాజకీయ పార్టీలను మోసం చేస్తావ్?? నీకు చరిత్రనే సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. పిట్టలదొర మాదిరి ప్రగల్భాలు పలికితే ఊరుకోమన్నారు. ఖమ్మం జిల్లా రాజకీయాల్లో పొంగులేటి ఓ బచ్చా. ఖమ్మం జిల్లా రాజకీయ చరిత్రలో పువ్వాడ కుటుంబానికి ఒక చరిత్ర ఉంది. పొంగులేటి పక్కన ఉన్నోళ్లు రౌడీషీటర్లు, గంజాయి అమ్మేవాళ్ళు, బ్యాంకులను దోచుకున్నోళ్ళు.. రైతుల నోట్లో మట్టుకొట్టినోళ్లే. దోపిడీదారులు అరాచక వాదులకు కేరాఫ్ అడ్రస్ పొంగులేటి. కాంట్రాక్టర్‌గా ఉన్నప్పుడు కెనాల్ మోడల్‌లో పనులు చేయకుండా వందల కోట్ల రూపాయలు బొక్కినావని, నీ పాలోడే ఆరోజు నీ మీద కంప్లైంట్ ఇస్తే విజిలెన్స్ రిపోర్ట్ ఉంటే జైల్లోకి పోకుండా రాజకీయాల్లో చేరావు’’ అని పొంగులేటిపై పువ్వాడ ఘాటు విమర్శించారు.