ఆకాల వర్షంపై మంత్రి గంగుల ఆరా..

-

తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురిశాయి. తెల్లవారు జామునే కురిసిన వర్షంతో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. ఉపరితల ఆవర్తన ప్రభావంతో రాష్ట్రంలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్ సహా రాష్ట్రవ్యాప్తంగా ఉరుములు, మెరుపులతో కూడిన ఎడతెరిపి లేని వాన కురిసింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రహదారులపైకి నీరు చేరి వాహనదారులు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొన్నారు. అయితే.. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో అర్థరాత్రి ఏకదాటిగా భారీ వర్షం కురిసింది. జగిత్యాల, కోరుట్ల, హుజురాబాద్, జమ్మికుంటలో వర్షం ప్రభావంతో కొనుగోలు కేంద్రాల్లో వరిధాన్యం కొట్టుకపోయింది. కొన్ని చోట్ల టార్ఫిన్లు లేక వరి ధాన్యం తడిసి ముద్దైంది.

Telangana minister Gangula Kamalakar tests COVID-19 positive

రాష్ట్రంలో అకాల వర్షాలపై సివిల్ సప్లై శాఖ మంత్రి గంగుల కమలాకర్ ఆరా తీశారు. వర్షాల కారణంగా ఎఫెక్ట్ అయిన ధాన్యం కేంద్రాలపై సివిల్ సప్లై అధికారులు, జిల్లా కలెక్టర్ల నుండి మంత్రి వివరాలు అడిగి తెలుసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 15 వేల టార్పాలిన్ కవర్లు అందుబాటులో ఉన్నాయి. హైదరాబాద్ మినహా జిల్లాల్లో వర్షం ప్రభావం పెద్దగా కనిపించలేదు. కొన్ని జిల్లాల్లో వర్షం ఉన్నందున ధాన్యం తడవకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news