పేపర్ లీడర్ కావాలా? ప్రాపర్ లీడర్ కావాలా?: హరీశ్ రావు

-

రాష్ట్రం మీద కేసీఆర్కు ఉన్న తపన, పట్టుదల మరెవరికీ లేవని మంత్రి హరీశ్ రావు స్పష్టం చేశారు. తెలంగాణ ఐఎంఏ అధ్యక్షుడు బీఎన్ రావు బీఆర్ఎస్లో చేరిన సందర్భంగా మాట్లాడిన హరీశ్.. పేపర్ లీడర్ కావాలా? ప్రాపర్ లీడర్ కావాలా? అని ప్రశ్నించారు. 70 ఏళ్లుగా అపరిష్కృతంగా ఉన్న పనులు ఇప్పుడు చకచకా జరుగుతున్నాయన్నారు. రాష్ట్రంలో ఎక్కడా అల్లర్లు, మతకల్లోలాలు లేవని మంత్రి వివరించారు.

అంతేకాక, రుణ మాఫీ డబ్బులను నేరుగా రైతుల చేతికే అందించాలని తెలంగాణ ఆర్ధిక మంత్రి హరీష్ రావు బ్యాంకు అధికారులకు సూచించారు. హైదరాబాద్ లోని బేగంపేట్ లో జరిగిన బ్యాంకర్ల సమావేశంలో పాల్గొన్న హరీష్ రావు, ఇప్పటికే క్రాప్ లోన్స్ ను చెల్లించిన రైతులకు రుణ మాఫీ నగదును నేరుగా వారి చేతులకే అందించాలని హరీష్ రావు బ్యాంకు అధికారులకు సూచించారు. రాష్ట్రంలోని చాలా మంది రైతులు పర్సనల్ లోన్స్ లేదా హోమ్ లోన్స్ ను కలిగి ఉన్నారని, ఒకవేళ రుణ మాఫీకి సంబంధించిన డబ్బును వారి బ్యాంకు ఖాతాలోకి జమ చేస్తే, రుణ మాఫీ నగదును బ్యాంకులు పర్సనల్ లోన్స్ లేదా హోమ్ లోన్స్ రుణాల కింద జమ చేసుకునే అవకాశం ఉందని, అప్పుడు రైతుల అవసరాలకు రుణ మాఫీ డబ్బును వినియోగించుకోలేరని, దానికి నివారించడానికి నేరుగా రైతుల చేతికే రుణ మాఫీ నగదును ఇవ్వాలని హరీష్ రావు బ్యాంకు అధికారులకు సూచించారు.

Read more RELATED
Recommended to you

Latest news