ప్రధానికి ఉండాల్సిన లక్షణాలు కేసీఆర్‌కు ఉన్నాయి: ఒవైసీ

-

 

సీఎం కేసీఆర్ను తక్కువ అంచనా వేయొద్దని.. ప్రధానికి ఉండాల్సిన లక్షణాలు ఆయనకు ఉన్నాయని మజ్లిస్ చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. మరోసారి కేసీఆర్ అధికారంలోకి రానున్నట్లు తెలిపారు. చాలా జిల్లాల్లో బీజేపీకి బలం లేదని.. ఆ పార్టీ సీట్లు సింగిల్ డిజిట్లోనే ఉండే అవకాశాలున్నాయని జోస్యం చెప్పారు. ఈ సారి తమ పార్టీ స్థానాలను పెంచుకుంటామని పేర్కొన్నారు.

దేశంలో కూడా తెలంగాణలాంటి విజన్‌ కావాలని.. దేశంలో మూడో ఫ్రంట్‌ రావాల్సిన అవసరం ఎంతైనా ఉందని అభిప్రాయం వ్యక్తం చేశారు. తమకు బలం ఉన్న చోట తాము తప్పకుండా పోటీ చేస్తామని స్పష్టం చేశారు. ఏ రాష్ట్రంలోనైనా మసీద్‌ కూల్చితే మళ్లీ కట్టారా..? అని ప్రశ్నించిన ఓవైసీ.. మైనార్టీల కోసం తెలంగాణ ప్రభుత్వం చాలా చేస్తోందన్నారు. రెసిడెన్షియల్‌ స్కూల్స్‌లో మైనార్టీ పిల్లలు అద్భుతంగా చదువుకుంటున్నారని పేర్కొన్నారు.

 

 

Read more RELATED
Recommended to you

Latest news