రాష్ట్రంలో ప్రతీ ఇంటికీ కేసీఆర్‌ నల్లా నీళ్లు తీసుకువచ్చారు : హరీష్‌ రావు

-

విపక్షాల మాటలకు విలువ లేదని, కేసీఆర్‌ మాటకు దిరుగులేదని మంత్రి హరీశ్‌రావు అన్నారు. రంగారెడ్డి జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో మంత్రి హరీశ్‌రావు పాల్గొన్నారు. మహేశ్వరం నియోజకవర్గం కందుకూరులో మెడికల్ కళాశాల నిర్మాణానికి మంత్రి సబితా ఇంద్రారెడ్డితో కలిసి శంకుస్థాపన చేశారు. అనంతరం హరీశ్‌రావు మాట్లాడుతూ.. కందుకూరులో వైద్యకళాశాలకు శంకుస్థాపన చేయడం సంతోషంగా ఉందన్నారు. ఉమ్మడి పాలనలో వివక్షకు గురైన ఈ ప్రాంతం, కేసీఆర్‌ నాయకత్వంలో అభివృద్ధిలో ముందుకు సాగుతుందన్నారు.

Expedite works of nine new medical colleges: Harish Rao

అభివృద్ధి, సంక్షేమంతోపాటు ఇక నుంచి మెడికల్ కళాశాల ద్వారా 450 పడకల ఆసుపత్రితో వైద్యం, విద్యార్థులకు వైద్య విద్య మహేశ్వరం నియోజకవర్గానికి అందిస్తున్న సీఎం కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్రంలో 10వేల మెడికల్‌ సీట్లు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. దేశవ్యాప్తంగా కేంద్రం ఏర్పాటు చేసినవి 157 మెడికల్‌ కాలేజీలు ఏర్పాటు చేసిందని.. ఇందులో ఒక్క మెడికల్‌ కాలేజీ కూడా తెలంగాణకు ఇవ్వలేదని ఆరోపించారు. కేసీఆర్‌ సొంత నిధులతో 36 మెడికల్‌ కాలేజీలను కేసీఆర్‌ ఏర్పాటు చేశారన్నారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో మూడు మెడికల్‌ కాలేజీలను ఏర్పాటు చేశారన్నారు. రాష్ట్రంలో ప్రతీ ఇంటికీ కేసీఆర్‌ నల్లా నీళ్లు తీసుకువచ్చారని చెప్పారు.

ఇది ఇలా ఉంటె, రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు కల్వకుర్తి నియోజకవర్గ కేంద్రంలో జరిగే కార్యక్రమాలకు హాజరవుతున్న తరుణంలో ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి, నాగర్ కర్నూల్ జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ బాలాజీ సింగ్ ఆదివారం పార్టీకి రాజీనామా చేశారు. సిట్టింగ్ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ కు తిరిగి టికెట్ కేటాయించడాన్ని మొదటి నుంచి వ్యతిరేకిస్తూ వచ్చిన కసిరెడ్డి నారాయణరెడ్డి, బాలాజీ సింగ్ రాష్ట్ర మంత్రులు హరీష్ రావు, కేటీఆర్ లకు పలు మార్లు నియోజకవర్గం లో ఉన్న పరిస్థితులను గురించి వివరించినప్పటికీ ప్రయోజనం లేకపోయింది.

 

 

Read more RELATED
Recommended to you

Latest news