వైద్యులకు కీలక సూచనలు చేసిన మంత్రి హరీష్ రావు…

వైద్య, విద్య పరిధిలోని ఆస్పత్రుల ప‌నితీరుపై వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. సర్కార్ దవాఖాన్లలో అన్ని మందులనూ అందుబాటులో ఉంచుతున్నామని, ఎట్టి పరిస్థితుల్లోనూ మందులు బయట కొనుక్కోవాలంటూ పేషెంట్లకు చీటీలు రాసి ఇవ్వొద్దంటూ అధికారులను ఆదేశించారు మంత్రి హరీశ్​రావు. పేషెంట్లకు బ్రాండెడ్ మందులు రాయవద్దని, జనరిక్ మెడిసిన్స్ మాత్రమే రాయాలని స్పష్టం చేశారు హరీష్ రావు. ప్రజ‌ల‌కు నాణ్యమైన వైద్య సేవ‌లు అందించాలన్న హరీష్ రావు.. మెటర్నిటీ, ఆర్థోపెడిక్, జ‌న‌ర‌ల్ స‌ర్జరీ స‌హా అన్ని విభాగాల్లో ఆరోగ్యశ్రీ కింద మ‌రింత ఎక్కువ‌గా సేవలు అందించాలన్నారు ఆదేశాలు జారీ చేశారు.

Harish Rao : పేద‌ల‌కు నాణ్య‌మైన వైద్య సేవ‌లు అందించాలి-హరీష్ రావు | Harish Rao

ముఖ్యంగా పెద్దాపరేషన్ల సంఖ్యను పెంచాలని, శానిటేషన్, డైట్ టెండర్లను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని మంత్రి హరీష్ రావు అన్నారు. మొన్నటివరకు గాంధీ, ఉస్మానియా దవాఖాన్లకే పరిమితమైన మోకాలి చిప్ప మార్పిడి ఆపరేషన్ లను నిన్న సిద్దిపేటకు, ఈ రోజు నిజామాబాద్ ప్రభుత్వ మెడికల్ కాలేజీకి విస్తరించామని తెలిపారు హరీష్ రావు. గాంధీ ఆస్పత్రిలో ఇదివరకే ఫెర్టిలిటీ సెంటర్​ను ప్రారంభించామని, ఇప్పుడు మరో 2 ఆస్పత్రులకు ఈ సేవలను విస్తరిస్తున్నామని మంత్రి హరీష్ రావు వెల్లడించారు.