బీజేపీపై రాష్ట్ర మంత్రి జగదీశ్ రెడ్డి మరోసారి తీవ్రంగా ఫైర్ అయ్యారు. మునుగోడు నియోజకవర్గంలోని నాంపల్లి మండలం ఎస్.లింగోటంలో టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి మద్దతుగా ప్రచారం నిర్వహించారు. కులమతాల పేరుతో ప్రజల మధ్య మంటలు పెట్టే బీజేపీకి మునుగోడులో డిపాజిట్ కూడా దక్కకుండా ప్రజలు బుద్ధిచెప్పాలని మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు. అభివృద్ధి ఏవైపు ఉంటుందో.. ప్రగతి నిరోధకులు ఎవరో ప్రజలు బాగా ఆలోచించి ఓటు వేయాలని కోరారు.
సీఎం కేసీఆర్‌ను గెలిపించుకుంటే తెలంగాణ రాష్ట్రం ఎలాగైతే అన్ని రంగాల్లో నంబర్ వన్ గా నిలుస్తుందో మునుగోడులో అభివృద్ధి కూడా అదే విధంగా జట్ స్పీడ్‌తో దూసుకెళ్తుందని మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు. కూసుకుంట్ల గెలుపుతో నియోజకవర్గ దశ తిరుగుతుందని, అందివచ్చిన అవకాశాన్ని చేజార్చుకోవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కాంట్రాక్టుల కోసం రాజగోపాల్ రెడ్డి అమ్ముడుపోయాడని విమర్శించారు. ఆయన మళ్లీ గెలిస్తే ఈ ప్రాంతానికి ఎలాంటి అభివృద్ధి జరగదని అన్నారు.