రిలేషన్ షిప్ లో ఉన్నప్పుడు చేసే చిన్న చిన్న తప్పులు వల్లనే బ్రేకప్ అయిపోతూ ఉంటుంది. అందుకని రిలేషన్షిప్ లో ఉన్నప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. లేకపోతే ఇక అంతే సంగతులు. చాలా మంచి రిలేషన్ షిప్ లో ఉన్నప్పుడు ఇలాంటి పొరపాట్లు చేస్తుంటారు ఇటువంటి పొరపాట్లు దూరంగా ఉండకపోతే మీ ప్రేమ ఫెయిల్ అయినట్లే.
నిజాయితీగా లేకపోవడం:
చాలామంది నిజాయితీగా ఉండరు ఎన్నో విషయాలను దాచేస్తూ ఉంటారు అయితే మీరు కూడా నిజాయితీగా లేకపోతే కచ్చితంగా మీరు ప్రేమలో ఫెయిల్ అవుతారు.
గొడవలు పెట్టుకోవడం:
గట్టిగా అరవడం ఒకరినొకరు తిట్టుకోవడం వంటివి చేసినప్పుడు లవ్ ఫెయిల్యూర్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి కాస్త కంట్రోల్ లో ఉండండి.
ముఖ్యమైన తేదీలని మర్చిపోవడం:
మొదటిసారి కలిసిన రోజు మీ పార్ట్నర్ పుట్టినరోజు ఇలాంటి ముఖ్యమైన తేదీలుని కనుక మర్చిపోయారు అంటే సమస్యలు వస్తాయి మీరు చిక్కుల్లో పడినట్లే కాబట్టి ఇటువంటి వాటిని మర్చిపోకండి.
అభినందించడం ముఖ్యం:
మీ పార్టనర్ ని మీరు అభినందించాలి. ఇది చాలా ముఖ్యమైనది. మీరు మీ పార్టనర్ గెలుపుని అభినందిస్తూ ఉండాలి అదే ఒకవేళ ఫెయిల్యూర్ ఎదురైతే ప్రోత్సహించడం ఇవన్నీ కూడా చాలా ముఖ్యం.
పాత వాటిని పదే పదే తవ్వడం:
మర్చిపోయిన విషయాలను కూడా పదే పదే గుర్తుచేసి చెబుతూ ఉంటే కూడా రిలేషన్షిప్ లో ఇబ్బందులు వస్తాయి కాబట్టి ఇటువంటి తప్పుల్ని అనవసరంగా చేయకండి మీ రిలేషన్షిప్ ని ప్రమాదంలో పెట్టుకోకండి.