మునుగోడు ఉపఎన్నికలో గెలుపు కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్న అధికార టీఆర్ఎస్ పార్టీకి చిక్కులు మీద చిక్కులు వచ్చి పడుతున్నాయి. ఓ వైపు పార్టీ నాయకులని బీజేపీ లాగేసుకునే కార్యక్రమం చేస్తుంది. ఇక వారిని ఆపడానికి టీఆర్ఎస్ అధిష్టానం నానా తంటాలు పడాల్సి వస్తుంది. ఆఖరికి సొంత పార్టీ నేతలనే డబ్బులు ఇచ్చి కొనుక్కోవాల్సిన పరిస్తితి వచ్చింది.
ఇదిలా ఉంటే ఉపఎన్నికలో స్వతంత్ర అభ్యర్ధులకు కేటాయించే గుర్తులతో టీఆర్ఎస్‌కు చిక్కులు వచ్చి పడ్డాయి. అందులో కారుని పోలిన గుర్తులు చాలా ఉన్నాయి. కారుని పోలి ఉండే కెమెరా, చపాతీ రోలర్, రోడ్ రోలర్, పల్లకి, సబ్బు పెట్టే, టీవీ, ఓడ లాంటి గుర్తులు ఉన్నాయి. ఈ గుర్తులని రద్దు చేసి వేరే గుర్తులు ఇవ్వాలని ఈసీని, ఆఖరికి కోర్టుకు కూడా టీఆర్ఎస్ వెళ్లింది..అయినా సరే ప్రయోజనం లేకుండా పోయింది. అయితే కొంత అధికార ఒత్తిళ్ళ వల్ల రోడ్ రోలర్, ట్రాక్టర్, ఆటో, ట్రక్ లాంటి గుర్తులని ఎవరికి కేటాయించలేదు. కానీ మిగిలిన గుర్తులని కేటాయించారు.
అయితే వీటిలో కారు గుర్తుకు రిస్క్ తెచ్చేది చపాతీ రోలర్. ఎందుకంటే మునుగోడు బరిలో మొత్తం 47 మంది అభ్యర్ధులు ఉన్నారు. అంటే మూడు ఈవీఎం యూనిట్లతో ఉప ఎన్నిక జరగనుంది. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే..ఫస్ట్ ఈవీఏంలో ఫస్ట్ బీఎస్పీ ఉంది..తర్వాత టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీల గుర్తులు ఉన్నాయి. అదే ఈవీఏంలో 12వ నెంబర్ స్వతంత్ర అభ్యర్ధి శ్రీశైలం యాదవ్ గుర్తు చపాతీ రోలర్. ఇది కొంతవరకు కారు గుర్తుని పోలి ఉంటుంది.
అందుకే టీఆర్ఎస్ అధిష్టానం టెన్షన్ పడుతుంది. ముసలివాళ్లు, కాస్త కంటి చూపు మందగించిన వారికి కారు, చపాతీ రోలర్ గుర్తులతో కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంది. దీని వల్ల కారు గుర్తుకు ఓటు వేయబోయి రోలర్ గుర్తుకు వేసే ఛాన్స్ ఉంది. దీంతో టీఆర్ఎస్‌కు నష్టం. మరి గుర్తు విషయంలో టీఆర్ఎస్ ఎలా ముందుకెళుతుందో చూడాలి. చపాతీ రోలర్ గుర్తుకు ఎక్కువ ఓట్లు పడితే టీఆర్ఎస్‌కే నష్టం.