ఆరేళ్ళ చిన్నారి చైత్ర ఘటనపై మొదటి సారిగా మీడియా ముందు మంత్రి కేటీఆర్ స్పందించారు. ఆరేళ్ల చిన్నారి చైత్ర విషయం లో తాను చాలా బాధ పడ్డానని..తన కు ఒక బిడ్డ ఉందని గుర్తు చేశారు. సిఎం కేసీఆర్ లేదా కెటిఆర్ పోతేనే న్యాయం జరుగుతుంది అంటే ఎలా.. ? పోలీసు లు ఎలా పని చేశారో అందరూ చూశారని తెలిపారు.
అందరికీ న్యాయం జరుగుతుందని.. తాము వెళ్లకుండా కూడా న్యాయం జరిగిందా లేదా ? అని ప్రశ్నించారు మంత్రి కేటీఆర్. ఫాస్ట్ ట్రాక్ కోర్టు ల కన్నా ఫాస్ట్ గా న్యాయం జరుగుతుందని మంత్రి కేటీఆర్ ఆసక్తి కర వ్యాఖ్యలు చేశారు. కాగా చిన్నారి చైత్ర.. ఘటనకు కారణమైన నిందితుడు రాజు… గురువారం రోజున ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. స్టేషన్ ఘన్పూర్ రైల్వే ట్రాక్ దగ్గర కోణార్క్ ఎక్స్ప్రెస్ కిందపడి నిందితుడు రాజు సూసైడ్ చేసుకున్నాడు. దీంతో ఈ ఘటనకు పుల్ స్టాప్ పడింది.