బ‌ట్ట‌లూడ‌దీసి కొడ‌తాం.. కేటీఆర్ వార్నింగ్..!

తెలంగాణ మంత్రి కేటీఆర్ ప్ర‌తిప‌క్షాల ఆరోప‌ణ‌ల‌పై బ‌గ్గుమ‌న్నారు. సీఎం కేసీఆర్ ను దూషిస్తే ఊరుకోమ‌ని బ‌ట్ట‌లు ఊడ‌దీసి కొడ‌తామ‌ని కేటీఆర్ వ్యాఖ్యానించారు. సాయుధ పోరాటానికి కూడా బీజేపీ మ‌తం రంగు పులుముతోంద‌ని కేటీఆర్ వ్యాఖ్యానించారు. త‌మ‌కు అంద‌రి అక్ర‌మ సంపాధ‌న తెలుసున‌ని అన్నీ త్వ‌ర‌లో బ‌య‌ట ప‌డ‌తాయ‌ని కేటీఆర్ వార్నింగ్ ఇచ్చారు. త్వ‌ర‌లో అన్నీ బ‌య‌ట‌పెడ‌తామ‌ని కేటీఆర్ స్ప‌ష్టం చేశారు.ktr

త‌న‌పై డ్ర‌గ్స్ ఆరోప‌ణ‌లు చేస్తున్నార‌ని తాను అన్ని డ్ర‌గ్స్ టెస్టుల‌కు సిద్ధ‌మ‌ని కేటీఆర్ చెప్పారు. మ‌రి రాహుల్ గాంధీ సిద్ద‌మా అంటూ కేటీఆర్ స‌వాల్ విసిరారు. త‌ప్పుడు ఆరోప‌ణ‌లు చేస్తే చూస్తూ ఊరుకోమ‌ని కేటీఆర్ హెచ్చ‌రించారు. త‌ప్పుడు ఆరోప‌ణ‌లు చేస్తే రాజ‌ద్రోహం కేసులు పెడ‌తామ‌ని కేటీఆర్ హెచ్చ‌రించారు. కాగా కేటీఆర్ పై డ్ర‌గ్స్ ఆరోప‌ణ‌లు రావ‌డంతో ఫైర్ అవ్వ‌డం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.