పరిశ్రమల శాఖపై కేటీఆర్‌ సమీక్ష.. ఆపై హెచ్చరిక..!

-

తెలంగాణ మంత్రి కేటీఆర్‌ ఇవాళ పరిశ్రమల శాఖపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్ణీత గడువు లోపల కార్యకలాపాలు ప్రారంభించకపోతే కంపెనీలకు ఇచ్చిన భూములు వెనక్కి తీసుకుంటామని మంత్రి కేటీఆర్‌ హెచ్చరించారు. ఇప్పటికే భూములు పొంది కార్యకలాపాలు ప్రారంభించని కంపెనీలకు షోకాజ్‌ నోటీసులు జారీ చేయాలని మంత్రి ఆదేశించారు. స్టేట్ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌పై జరిగిన సమీక్షా సమావేశంలో ఈ-స్టేట్‌ ఫైనాన్స్ కార్పొరేషన్ డిజిటల్‌ ప్లాట్‌ఫామ్‌ను కేటీఆర్ ప్రారంభించారు.

అలాగే ఫైనాన్స్ కార్పొరేషన్ కార్యకలాపాల విస్తరణకు సూచనలు చేశారు. అదేవిధంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న హైదరాబాద్ ఫార్మా సిటీపై ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించిన కేటీఆర్, దాని గురించి మాట్లాడుతూ.. హైదరాబాద్‌ ఫార్మా సిటీ కాలుష్య రహితంగా ఉండబోతుందని కేటీఆర్‌ తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news