తెలంగాణకు మరో రూ.1350 కోట్లు ఇవ్వాలి – కేంద్రం కీలక ప్రకటన

-

తెలంగాణకు రావాల్సిన నిధులపై లోకసభ లో నామా నాగేశ్వరరావు ప్రశ్నించారు. అయితే.. దానికి కేంద్ర ఆర్ధిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌధురి లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు. తెలంగాణ లోని వెనుకబడిన 9 జిల్లాలకు మూడేళ్ళ పాటు కేంద్రం నుంచి “ఆర్ధిక సహాయం” రాలేదని… తెలంగాణకు రావాల్సిన మొత్తం 1350 కోట్ల రూపాయలు అని తెలిపారు.

మూడేళ్ళ పాటు నిధులను తెలంగాణ కు విడుదల చేయని విషయాన్ని లిఖితపూర్వక సమాధానంలో స్పష్టం చేసిన కేంద్ర మంత్రి… ఏ కారణంగా నిధులను తెలంగాణకు విడుదల చేయలేదో స్పష్టంగా సమాధానం ఇవ్వలేదు. అయితే.. “నీతి ఆయోగ్” సిఫార్సులు, “నిధుల వినియోగం” పై రాష్ట్రం సమర్పించే పత్రాలతో పాటు, కేంద్రం వద్ద ఉన్న వనరుల ఆధారంగా తెలంగాణకు నిధులను విడుదల చేశామని చెప్పారు. ఏపి విభజన చట్టం”లోని సెక్షన్ 94 (2) ప్రకారం ఏడాదికి రూ. 450 కోట్లు చొప్పున మూడేళ్ళకు మొత్తం రావాల్సిన రూ. 1350 కోట్లు ను తెలంగాణ కు విడుదల చేయలేదన్నారు. 2019-20, 2021-22, 2022-23 ఆర్ధిక సంవత్సరాలకు చట్టం ప్రకారం తెలంగాణ కు రూ. 1350 కోట్లు రావాలన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news