చిత్తూరు జిల్లాలో ఏనుగుల సమస్య పై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రత్యేక దృష్టి సారించారు. వెంటనే అదనపు బేస్ క్యాంపులు ఏర్పాటు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం జిల్లలో 11 బెస్ క్యాంపులు సేవలందిస్తుండగా.. ఇప్పుడు అదనంగా మరో మూడు బేస్ క్యాంపులు ఏర్పాటుకు ఆదేశాలు ఇచ్చారు. పలమనేరు, పుంగనూరు నియోజకవర్గాల్లో ఇటీవల ఏనుగుల బెడద పెరిగిపోయింది.
ఇప్పుడు బేస్ క్యాంప్ ఏర్పాటుతో ట్రాకర్లు తిరగనున్నాయి. బేస్ క్యాంపులు అందుబాటులోకి వస్తే ఏనుగుల సంచారం పై గ్రామస్తులకు తక్షణ సమాచారం అందుతుంది. ఏనుగులను తిరిగి అడవిలోకి పంపించేందుకు సత్వర చర్యలకు అవకాశం ఉంటుంది. ఇప్పటికే జిల్లాలో 50 మందితో ఏనుగుల ట్రాకింగ్ చేస్తున్నారు అటవీ శాఖ అధికారులు. జిల్లాలో మొత్తం 80 నుండి 90 ఏనుగులు సంచరిస్తున్నట్లు సమాచారం.