బీఆర్​ఎస్​పై ఈసీకి పార్టీ తీర్మానం అందజేసిన టీఆర్​ఎస్ బృందం

-

తెలంగాణ రాష్ట్ర సమితిని భారత్ రాష్ట్ర సమితిగా మార్చిన టీఆర్​ఎస్ అధికారికంగా ఆ పనులను షురూ చేసింది. ఇందులో భాగంగానే ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ ఆధ్వర్యంలో టీఆర్ఎస్ బృందం దిల్లీకి వెళ్లింది. అక్కడ ఎన్నికల సంఘాన్ని కలిసి బీఆర్ఎస్ పై పార్టీ తీర్మానానికి సంబంధించిన కాపీని అందజేసింది. పేరు మార్పునకు ఆమోదం తెలపాలని టీఆర్ఎస్ బృందం ఈసీకి విజ్ఞప్తి చేసింది.

బీఆర్ఎస్ జాతీయ పార్టీగా గుర్తింపు పొందాలంటే కేంద్ర ఎన్నికల సంఘం-1968 నిబంధనలకు లోబడి ఉండాలి. సాధారణ ఎన్నికల్లో పార్లమెంట్‌ లేదా అసెంబ్లీ స్థానాల్లో నాలుగు లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాల్లో పోటీ చేయాలి. ఎన్నికల్లో పోలై, చెల్లిన ఓట్లలో ఆరు శాతం ఓట్లు సాధించాలి. కనీసం ఒక రాష్ట్రం నుంచి నాలుగు లోక్‌సభ స్థానాలు గెలువాలి. ఏవైనా నాలుగు రాష్ట్రాల నుంచి 11 లోక్‌సభ సీట్లు (రెండు శాతం సీట్లు) సాధించాలి. గెలుపొందిన అభ్యర్థులు కనీసం మూడు రాష్ట్రాల నుంచి ఎన్నికవ్వాలి.
కనీసం నాలుగు రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీగా గుర్తింపు పొంది ఉండాలి. జాతీయ పార్టీగా పేరు నమోదు చేసుకొనే పార్టీ గుర్తు.. దేశంలోని మరే ఇతర పార్టీ చిహ్నంగా ఉండకూడదు. ఈ నిబంధనల్లో ఏదో ఒక నిబంధన వర్తించినా బీఆర్ఎస్ కు జాతీయ పార్టీగా హోదా లభిస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news