తెలుగు చిత్ర పరిశ్రమలో రమ్యకృష్ణ పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు..హీరోయిన్ గా ఎన్నో సక్సెస్ చిత్రాలను ఇండస్ట్రీకి అందించింది..వయస్సు మీద పడుతున్న కూడా వన్నె తగ్గని అందంతో కుర్ర హీరోయిన్లకు పోటీని ఇస్తుంది. పాజిటివ్ నెగిటివ్ క్యారెక్టర్స్ అని తేడా లేకుండా అన్ని రకాల పాత్రలలో నటించి తన అందం అభినయంతో ఆకట్టుకున్న రమ్యకృష్ణ ఇప్పటికీ మంచి మంచి పాత్రలలో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తూ వస్తుంది.
అలా వరుస సినిమాల,షో లలో కనిపిస్తూ సందడి చేస్తున్నా ఈమె ఈ మధ్య విజయ్ దేవరకొండ హీరోగా నటించిన టైగర్ సినిమాలో కూడా కీలకపాత్రలో నటించింది.ఇక కృష్ణవంశీ దర్శకత్వంలో రానున్న రంగమార్తాండ సినిమాలో కూడా రమ్యకృష్ణ కీలక పాత్రలో కనిపించనుంది. ఇలా ఒకవైపు వరస సినిమాలలో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్న రమ్యకృష్ణ.. ప్రస్తుతం ఆహాలో ప్రసారం అవుతున్న ‘ డాన్స్ ఐకాన్ ‘ అనే డాన్స్ షోలో జడ్జ్ గా వ్యవహరిస్తున్నారు. ఓంకార్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న ఈ షో మంచి ప్రేక్షకాదరణ సొంతం చేసుకొని అత్యధిక వ్యూస్ తో దూసుకుపోతుంది..
ఇది ఇలా వుండగా..ఈ వారం షోకు సంబంధించిన ప్రోమోను విడుదల చేశారు. ఆ ఎపిసోడ్లో ఒక కంటెస్టెంట్ ‘నా అల్లుడు’ సినిమాలోని ‘సయ్యా సయ్యారే’ అనే పాటకు అదిరిపోయే మాస్ స్టెప్పులు వేసి అందరిని ఆకట్టుకుంది. ఇక ఈ సినిమాలో ఈ పాటకు రమ్యకృష్ణ డాన్స్ చేసిన సంగతి అందరికీ తెలిసిందే. గతంలో ఈ పాటకు డాన్స్ చేసే సమయంలో ఉన్న తన అనుభవాల గురించి రమ్యకృష్ణ చెబుతూ… ఈ పాట నాకు ఎంతో స్పెషల్.. ఈ పాటకి డాన్స్ చేసే సమయంలో నేను 4 నాలుగు నెలల గర్భవతిని అని చెప్పుకొచ్చింది.. ఈ ప్రోమో వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతుంది.. అంతేకాదు రకరకాల కామెంట్స్ ను కూడా అందుకుంటుంది..