ఇవాళ దక్షిణ కొరియాకు మంత్రి పొంగులేటి బృందం.. వారు డుమ్మకొట్టే అవకాశం..!

-

మూసీ పునరుజ్జీవం కోసం మంత్రులు, ప్రజా ప్రతినిధులు, సీనియర్ అధికారులతో కూడిన 25 మంది బృందం ఈనెల 21 నుంచి 24వ తేదీ వరకు దక్షిణ కొరియాలోని సియోల్ నగరాన్ని సందర్శించనుంది. అక్కడి రివర్ ఫ్రంట్ అభివృద్దిని సభ్యులు క్షేత్ర స్థాయిలో పరిశీలించనున్నారు. సియోల్ సందర్శనకు వెళ్లే మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎంపీలతో పాటు బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం పార్టీలకు చెందిన ఎమ్మెల్యేల పేర్లను ప్రభుత్వం ఇప్పటికే ఎంపిక చేసింది. ఎంఐఎం ఎమ్మెల్యేలు మహ్మద్ అహ్మద్ బిన్ అబ్దుల్లా బలాల ఉండగా.. బీఆర్ఎస్ నుంచి టీ.ప్రకాశ్ గౌడ్, కాలేరు వెంకటేష్, దేవిరెడ్డి సుధీర్ రెడ్డి, చామకూర మల్లారెడ్డి, బీజేపీ నుంచి రాజాసింగ్ ఉన్నారు. 

 

ప్రభుత్వం ఎంపిక చేసిన 25 మందిలో బీఆర్ఎస్, బీజేపీలకు చెందిన ఐదుగురు సభ్యులు ఉన్నారు. వీరి హాజరు అనుమానంగానే కనిపిస్తున్నది. బీఆర్ఎస్, బీజేపీ ఇప్పటికే మూసీ ప్రాజెక్ట్ ను వ్యతిరేకిస్తున్నాయి. మాజీ మంత్రి కేటీఆర్ ఏకంగా తెలంగాణ భవన్ లో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వం రూపొందించిన ప్రాజెక్ట్ కి ప్రతిపాదనను వ్యతిరేకించారు. ఈ తరుణంలో బీఆర్ఎస్ సభ్యులు సియోల్ టూర్ వెళ్తారా..? లేరా..? అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మరోవైపు ఇవాళ మధ్యాహ్నం నాగోల్ కి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వస్తున్నారని ప్రకటించారు. దీంతో సియోల్ టూరికి  బీఆర్ఎస్ నేతలు హాజరయ్యే అవకాశం లేదనే చెప్పవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news