తెలంగాణలోనూ స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటుకు కృషి చేస్తాం : మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌

-

దక్షిణ కొరియాలో ఉన్న అత్భుతమైన పర్యాటక సొబగులను తెలంగాణలోనూ తీర్చిదిద్దుతామని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. దక్షిణ కొరియా రాజధాని సియోల్‌లో అధికారులతో కలిసి మంత్రి పర్యటించారు. సియోల్ నగరంలోని డి- మిలిటరీ జోన్ సమీపంలో ఏర్పాటు చేసిన చిల్డ్రన్ అమ్యూజ్మెంట్ పార్క్‌ను మంత్రి సందర్శించి.. నిర్వాహకులను అడిగి వివరాలు తెలుసుకున్నారు.

Minister Srinivas goud | నేడు కేటీఆర్‌ చేతుల మీదుగా నీరా కేఫ్‌ ప్రారంభం..  గౌడజాతి కేసీఆర్‌కు రుణపడి ఉంటుంది: మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌-Namasthe  Telangana

బుధవారం మంత్రితో రిపబ్లిక్ ఆఫ్ కొరియా లోని ఇండియన్ అంబాసిడర్ అమిత్ కుమార్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణలో క్రీడల అభివృద్ధికి దక్షిణ కొరియా తరహాలో స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటుకు కృషి చేస్తామన్నారు. అమ్యూజ్మెంట్ పార్కులు, అడ్వెంచర్ టూరిజం, చిల్డ్రన్స్ పార్కుల తరహాలో తెలంగాణలో ఏర్పాటు చేస్తామన్నారు.
హైదరాబాద్ లోని ట్యాంక్ బండ్, బుద్వెల్, గండిపేట తదితర పర్యాటక ప్రాంతాల్లో ఏర్పాటు కు దక్షిణ కొరియా తరహాలో పర్యాటకాభివృద్ధి కోసం పూర్తి సహకారం అందజేస్తామని భారత అంబాసిడర్ అమిత్ కుమార్ వెల్లడించారు. క్రీడా మైదానాలలో మౌలిక సదుపాయాల కల్పన ఏర్పాటుకు, స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటుకు అవసరమైన సహకారం అందిస్తామని తెలిపారు. ఈ సమావేశంలో రాష్ట్ర పర్యాటకాభివృద్ధి సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ మనోహర్ పాల్గొన్నారు.

 

 

Read more RELATED
Recommended to you

Latest news