నగరంలో వరుస అగ్ని ప్రమాద ఘటనలపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్ బాగ్ లింగంపల్లి లోని వి ఎస్ టి వద్ద ఓ గోదాములో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ నేపథ్యంలో ఘటన స్థలాన్ని స్థానిక ఎమ్మెల్యే ముఠాగోపాల్ తో కలిసి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పరిశీలించారు. ప్రమాదానికి గల కారణాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ.. ఇలాంటి ప్రమాదాల నివారణకు చేపట్టవలసిన చర్లపై ఉన్నత స్థాయి సమావేశం జరిగిందన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఇప్పటికైనా వ్యాపారస్తులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఇకపై చెప్పడం ఉండదని, సీరియస్ యాక్షన్ తీసుకుంటామని హెచ్చరించారు. ఒకరి వల్ల ఇతరులకు నష్టం కలిగితే ఎవరూ భరించలేరని అన్నారు. రెండు వారాల క్రిందట సికింద్రాబాద్లోని డెక్కన్ మాల్ లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకోగా, నేడు ఉదయం చిక్కడపల్లిలోని గోదాములోనూ ఇలాంటి ఘటనే జరిగింది.