పోలీస్ అధికారిపై మంత్రి వెల్లంపల్లి చిర్రుబుర్రు..!

విజయవాడ ఇంద్రకీలాద్రిపై నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా రాజకీయ నాయకులు, అధికారులు అమ్మవారిని దర్శించుకునేందుకు తరలివస్తున్నారు. డీజీపీ గౌతమ్ సవాంగ్ కూడా ఈ రోజు అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ అధికారులు డీజీపి కి పూర్ణకుంభ స్వాగతం పలికారు. ఇదిలా ఉంటే అదే సమయంలో మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ కూడా అమ్మవారి దర్శనానికి విచ్చేశారు.

కాగా ఇంద్రకీలాద్రిపై విధులు నిర్వహిస్తున్న ఓ పోలీస్ అధికారి పై మంత్రి వెల్లంపల్లి ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. మంత్రి దర్శనానికి వెళ్తున్న సమయంలో సీఐ గుర్తుపట్టక పోవడంతో అతని పై సీరియస్ అయినట్లు తెలుస్తోంది. దాంతో పక్కకు తెలుగు అంటూ సీఐపై వెల్లంపల్లి ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం. డీజీపీ గౌతమ్ సవాంగ్ దర్శనం పూర్తి చేసుకుని తిరిగి వస్తున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. మంత్రి తీరుపై పోలీసులు తప్పు పడుతున్నారు. భక్తుల రద్దీ నేపథ్యంలోనే సీఐ చూసుకొని ఉండకపోవచ్చని చెబుతున్నారు.