కూతురితో అక్రమ సంబంధం : కార్పొరేటర్ భర్త ను చెప్పుతో కొట్టిన మహిళ !

నిజామాబాద్ లో పట్టణం లోని కార్పొరేటర్ భర్త ను ఇంటికి వెళ్లి ఓ మహిళ చెప్పుతో కొట్టింది. తమ కూతురి తో వివాహేతర సంబంధం పెట్టుకుని వాడుకుంటున్నాడంటూ ఆరోపణలు చేస్తూ ఆ మహిళ.. చెప్పుతో కొట్టింది. అంతే కాదు తన కూతురి ని మోసం చేశాడంటూ నిజామాబాద్ వినాయక నగర్ లోని కార్పొరేటర్ భర్త ఇం టి ముందు బాధిత కుటుంబం ఆందోళ న దిగింది.

గతంలోనూ మందలించిన ఆ కార్పొరేటర్ భర్త తీరు.. మారక పోవడం.. ఏకంగా ఇంటి ముందే ఆందోళనకు దిగింది బాధిత కుటుంబం. రాత్రి తన కూతురిని ఎత్తుకెళ్లిన కార్పొరేటర్ భర్త ఆకుల శీను ను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నమంటూ బాధితురాలు తల్లిదండ్రులు ఆరోపణలు చేస్తున్నారు.

ఈ విషయంలో తమకు న్యాయం చేయాలంటూ అమ్మాయి తల్లిదండ్రుల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇందులో భాగంగానే కార్పొరేటర్ భర్త ఆకుల శీను ఇంటి ముందు ఆందోళనకి దిగారు అమ్మాయి తల్లిదండ్రులు. ఈ నేపథ్యంలోనే ఆకుల శీనుపై దాడి చేశారు అమ్మాయి తల్లిదండ్రులు. మొత్తానికి ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఈ ఘటనకు సంభందించిన వివరాలు తెలియాల్సి ఉంది.