జగన్ సైగ చేస్తే ఏపీలో ఒక్క టిడిపి నేత తిరగలేడు : వెల్లంపల్లి

-

చెండాలపు మాటలు మాడ్లాడితే పడాలా.. .జగన్మోహన్ రెడ్డి సైగ చేస్తే రాష్ట్రంలో ఒక్క టిడిపి నేత తిరగలేడని హెచ్చరించారు మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు.  విజయవాడలో వైసిపి నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు. పంజా సెంటర్ లో చంద్రబాబు ఫోటో పై చెప్పులతో కొడుతూ వినూత్న రీతిలో నిరసన తెలిపారు వైసిపి శ్రేణులు. ఈ సందర్భంగా మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ… చంద్రబాబు 40 ఇయర్స్ ఇండస్ట్రీ 14 ఏళ్ళ ముఖ్యమంత్రి అని చెప్పుకోవడానికి సిగ్గులేదా ? అని ప్రశ్నించారు.

చంద్రబాబు ఎలా‌ ముఖ్యమంత్రి అయ్యాడో అందరికి తెలుసని…. హైద్రాబాద్ లో చంద్రబాబుకి ఇంద్రా ప్యాలెస్ లేదా ? అని ఫైర్‌ అయ్యారు. ఆంధ్ర రాష్ట్రంలో చంద్రబాబు ఆశాంతి సృష్టించాలని చూస్తున్నారని… వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తే చంద్రబాబు, అతని తాబేదారులు తట్టుకోలేరని హెచ్చరించారు. గంజాయికి పేటెంట్ హక్కు చంద్రబాబుదేనని… ముఖ్యమంత్రి పై చంద్రబాబు, అతని అడవి పందులు మాట్లాడితే ఖబడ్దార్ అని వార్నింగ్‌ ఇచ్చారు. ప్రజలను ఇబ్బంది పెడితే చంద్రబాబును సైతం అరెస్ట్ చేస్తామని హెచ్చరించారు.

Read more RELATED
Recommended to you

Latest news