పవన్ కంటే సన్నాసి ఎవ్వరూ లేరు…చిరంజీవి లేకపోతే జీరో : ఏపీ మంత్రి కౌంటర్‌

-

పవన్‌ కళ్యాణ్‌ కు ఏపీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ కౌంటర్‌ ఇచ్చారు. ఎవరు డబ్బులు ఇస్తే వాళ్ళ డైలాగులు చెప్పే వ్యక్తి పావలా పవన్ కళ్యాణ్ అని… విజయవాడ కార్పొరేషన్ లో ఒక్క సీటు కూడా గెలవలేకపోయాడని ఫైర్‌ అయ్యారు. రెండు చోట్ల పోటీ చేసి ఒక చోట గెలవలేక పోయాడని… టికెట్లు ప్రభుత్వం అమ్మితే తప్పేంటి ? అని ఫైర్‌ అయ్యారు.

రాష్ట్రంలో చోటు లేదని తెలిసి పవన్ మాటల్లో నిస్పృహ ఉందని… బ్లాక్ లో టిక్కెట్లు అమ్ముకుని బతికాలనుకునే నీచపు వ్యక్తి ఫైర్‌ అయ్యారు. కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ ఎందుకు తగ్గించుకోవాలిన.. పవన్ కంటే సన్నాసి ఈ రాష్ట్రంలో ఎవరూ లేరని నిప్పులు చెరిగారు. చిరంజీవి లేకపోతే పవన్ జీరో అని… ప్రకాశ్ రాజ్ నటనలో 25 శాతం కూడా నటించటం చేతకాదని ఎద్దేవా చేశారు. ఫామ్ హౌస్ లో కూర్చుని పేకాట ఆడటం తప్ప దేనికీ పనికి రాని వ్యక్తి పవన్ కల్యాణ్ అని… ముఖ్యమంత్రిని, మంత్రులను నోటికి వచ్చినట్లు మాట్లాడితే ఊరుకోమని హెచ్చరించారు వెల్లంపల్లి.

Read more RELATED
Recommended to you

Latest news