తిరుమలలో మంత్రులకు టీటీడీ సాగిలపడి సేవలు చేస్తుందంటూ ఆరోపణలు వినిపిస్తున్నాయి. కరోనా ఆంక్షల నేపథ్యంలో ఐదు నెలలుగా సామాన్య భక్తులకు శ్రీవారి దర్శనాన్ని టీటీడీ దూరం చేసిన సంగతి తెలిసిందే. అయితే మంత్రులకు మాత్రం ఇష్టారీతిన టిక్కెట్లను టీటీడీ జారీ చేస్తుందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. సామాన్య ప్రజలకు మాత్రం ఆంక్షలు విధిస్తూ… మంత్రులు మరియు వారి అనుచరులకు మాత్రం ప్రోటోకాల్ మర్యాదలతో దర్శనాలు ఏర్పాటు చేస్తున్నట్టు తెలుస్తోంది.
ఇరోజు మొత్తం 67 మంది అనుచరులుతో మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ దర్శనం చేసుకున్నారు. అయితే మీడియా ప్రశ్నించగా… అనుచరులతో కలిసి దర్శనం చేసుకోవడంలో తప్పు ఏముందని, వారు భక్తులే కదా….అని వెల్లంపల్లి ప్రశ్రించారు. సర్వదర్శనం భక్తులను దర్శనానికి కోవిడ్ నిభందనల మేరకు ఇప్పట్లో అనుమతించబోమని మంత్రి వెల్లడించారు. శ్రీవారి ఆలయం మంత్రులకు అడ్డాగా మారిపోతుందని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.