ఎస్బీఐ ఏటీఎం కార్డుని ఇంట్లో వుండే ఇలా ఈజీగా బ్లాక్ చేసుకోవచ్చు..!

-

యోనో ద్వారా సులభంగా ఎస్బీఐ ఏటీఎం కార్డుని ఇంట్లో వుండే ఇలా ఈజీగా బ్లాక్ చేసుకోవచ్చు. ఇక దీని కోసం పూర్తిగా చూసేస్తే…

sbi | ఎస్‌బీఐ
sbi | ఎస్‌బీఐ

స్టెప్ 1: ముందుగా యోనో యాప్‌కి వెళ్లి అక్కడ లాగిన్ అవ్వండి.

స్టెప్ 2: తర్వాత ‘సర్వీస్ రిక్వెస్ట్’ ఎంచుకోండి అక్కడ ‘బ్లాక్ ATM/డెబిట్ కార్డ్’ ఎంపికను సెలెక్ట్ చెయ్యండి.

స్టెప్ 3: ఇప్పుడు మీ ఇంటర్నెట్ బ్యాంకింగ్ ప్రొఫైల్ పాస్‌వర్డ్ ని ఎంటర్ చెయ్యండి.

స్టెప్ 4: అప్పుడు “కార్డ్ నంబర్” ఎంటర్ చేసి… “కార్డ్‌ను బ్లాక్ చేయడానికి కారణం” తెలపండి. ఇప్పుడు కార్డుని టెంపరరీ బ్లాక్ చెయ్యాలో పెర్మనెంట్ బ్లాక్ చెయ్యాలో సెలెక్ట్ చేయండి.

స్టెప్ 5: మీరు ఇప్పుడు మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌పై OTP వస్తుంది. దానిని ఎంటర్ చెయ్యండి.

SBI YONO యాప్‌ను డౌన్‌లోడ్ చేయడం ఎలా…?

Android లేదా iOS పరికరంలో Google ప్లే స్టోర్ లేదా Apple యాప్ స్టోర్‌కు వెళ్లండి.
యోనో అని టైప్ చేయండి.
డౌన్‌లోడ్ చేసిన తర్వాత, యాప్‌ను ఓపెన్ చెయ్యండి.
మీరు ఇప్పటికే ఉన్న కస్టమర్ అయితే, ఇప్పటికే ఉన్న కస్టమర్ ట్యాబ్‌పై నొక్కండి, లేకపోతే న్యూ కస్టమర్ ఎంపికపై క్లిక్ చెయ్యండి.
కొత్త కస్టమర్స్ అయితే ఫార్మ్ ఫిల్ చెయ్యాల్సి ఉంటుంది.
అదే ఇంటర్నెట్ బ్యాంక్ ఉంటే డీటెయిల్స్ తో లాగ్ ఇన్ అయ్యిపోవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news