పాలాభిషేకం చేయించుకున్న వైసీపీ ఎమ్మెల్యే…!

-

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్పిఆర్ విషయంలో కీలక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. వివాదాస్పదంగా మారిన ఈ రిజిస్టర్ విషయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మంగళవారం ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. ఎన్పిఆర్ విషయంలో కేంద్రం ముస్లింల మనోభావాలను పరిగణలోకి తీసుకోవాలని వారిలో అభద్రతా భావం ఉందని ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు కేంద్రం మార్పులు చెయ్యాలని ఆయన సూచించారు.

అదే విధంగా కేబినేట్ కూడా తీర్మానం చేసింది. ఎన్పీఆర్‌లో మార్పులు చేయాలంటూ అసెంబ్లీలో తీర్మానం చేయాలని ఏపీ కేబినెట్ నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో మైనారిటీలు నెల్లూరులో వైసీపీ ఎమ్మెల్యే కి పాలాభిషేకం చేసారు. ఆయన ఎవరో కాదు కోటంరెడ్డి శ్రీదర్ రెడ్డి. ఆయన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే గా ఉన్నారు. ఆయనకు పాలాభిషేకం చేసారు మైనార్టీలు.

వైఎస్ రాజశేఖర్ రెడ్డి, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి,కటౌట్ లతో పాటు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి పాలాభిషేకం చేశారు. అనంతరం ముస్లిం సంప్రదాయ అలంకరణలో ఎమ్మెల్యే కోటంరెడ్డిని సత్కరించారు. దీనిపై రాష్ట్ర వ్యాప్తంగా హర్షం వ్యక్తమవుతుంది. ఎన్పిఆర్ లో కేంద్ర ప్రభుత్వం చేర్చిన అంశాలు అన్నీ వివాదాస్పదంగా ఉన్నాయి అనే ఆరోపణలు వచ్చాయి. పలు రాష్ట్రాలు ఈ విషయంలో ఆందోళన వ్యక్తం చేసాయి.

Read more RELATED
Recommended to you

Latest news