మంత్రి కేటీఆర్: “రజాకార్” సినిమాతో చిచ్చు పెట్టే ప్రయత్నంలో బీజేపీ !

-

నిన్న “రజాకార్” సినిమా ట్రైలర్ ను చిత్ర బృందం విడుదల చేసింది.. ఈ ట్రైలర్ లో ఒక్క మాటలో చెప్పాలంటే ఇండియాకు స్వాతంత్య్రం వచ్చినా ? తెలంగాణకు రాలేదు అని చెప్పడమే వీరి ఉద్దేశ్యం. ఇంకా ముస్లిం లు ఏ విధంగా హిందువులను చిత్రహింసలకు గురి చేశారో మహా దారుణంగా చిత్రీకరించారు. ఈ సినిమా గురించి తాజాగా తెలంగాణ మంత్రి కేటీఆర్ స్పందించారు… కేవలం సంతోషంగా ఉన్న తెలంగాణ ప్రజల మధ్యన చిచ్చు పెట్టడానికి మాత్రమే ఈ సినిమాను తీసుకువస్తున్నారు అంటూ కామెంట్ చేశారు. ఈ సినిమాను నిర్మిస్తున్న గూడూరు నారాయణ రెడ్డి బీజేపీ నేత డబ్బులు పెట్టి రజాకార్ సినిమాను తెరకెక్కించారు, హిందువులు మరియు ముస్లిం లు గతంలో చంపుకున్న దృశ్యాలను మళ్ళీ తెరమీదకు తీసుకు వచ్చి ఆరిపోయిన గాయాలను మళ్ళీ రేపాలని చూస్తున్నారంటూ బీజేపీ పై కేటీఆర్ మండిపడ్డారు.

ఈ సినిమా ఒక్కటే కాదు.. గతంలో కాశ్మిరీ ఫైల్స్, ది కేరళ స్టోరీ, రజాకార్ లాంటి సినిమాలు తీసి బీజేపీ సాధించినది ఏమీ లేదంటూ కేటీఆర్ ఆవేశంగా కామెంట్ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news