మహిళా రిజర్వేషన్‌ బిల్లుపై స్పందించిన సీఎం జగన్‌

-

కొత్త పార్లమెంటు భవనంలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించారు. ఈరోజు చరిత్రలో నిలిచిపోయేరోజన్నారు. దేశంలో మహిళలను అన్ని రంగాల్లో ముందుకు తీసుకునేలా అడుగులే వేస్తున్నామన్న మోదీ మరో అడుగు వేయడానికి సిద్ధమయ్యాయనని తెలిపారు. మహిళ రిజర్వేషన్ బిల్లుకు నారీ శక్తి వందన్ పేరును పెడుతున్నట్లు ఆయన ప్రకటించారు. మహిళ రిజర్వేస్ల విషయంలో మరో అడుగు ముదుకు వేయబోతున్నామని తెలిపిన మోదీ ఈ బిల్లు చాలా కాలంగా పెండింగ్‌లో ఉందని తెలిపారు. అయితే.. సోమవారం సాయంత్రం ప్రధాని మోడీ అధ్యక్షతన జరిగిన కేబినెట్‌ ఈ బిల్లుకు ఆమోదం తెలిపిన విషయం విదితమే కాగా.. ఈ రోజు ఈ రాజ్యాంగ సవరణ బిల్లును కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్‌ రామ్ మేఘ్వాల్‌ లోక్‌సభలో ప్రవేశపెట్టారు. నారీ శక్తి వందన్‌ అభియాన్‌ పేరుతో కేంద్రం ఈ బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టింది.

CM YS Jagan Mohan Reddy to visit Kurnool today

అయితే దీనిపై భిన్నవాదనలు వినిపిస్తున్నాయి.. ఇక, మహిళలకు 33 శాతం రిజర్వేషన్ బిల్లుపై స్పందించిన ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి.. బిల్లును స్వాగతిస్తూ ట్వీట్ చేశారు.మహిళా రిజర్వేషన్ బిల్లుకు మద్దతు ఇవ్వటానికి గర్విస్తున్నాను అంటూ తన ట్వీట్‌లో పేర్కొన్నారు సీఎం వైఎస్‌ జగన్‌.. మాకు అత్యంత ప్రాధాన్యత అంశం మహిళా సాధికారత.. గత నాలుగేళ్లుగా సంక్షేమ పథకాలు, కార్యక్రమాలు, సమాన ప్రాతినిధ్యం ద్వారా మహిళా సాధికారత సాధించామని.. మరింత ఉజ్వలం భవిష్యత్తు, మరింత సమానత్వం సాధిద్ధాం అంటూ ట్విట్టర్‌లో రాసుకొచ్చారు ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌.మరోవైపు ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి.. మహిళా రిజర్వేషన్ బిల్లుకు వైసీపీ పూర్తిగా మద్దతు ఇస్తుందని స్పష్టం చేశారు. మహిళా కోసం జగన్ అనేక పథకాలు ప్రవేశ పెట్టారు. మహిళలకు నామినేటెడ్ , స్థానిక సంస్థల్లో 50 శాతం రిజర్వేషన్లు అమలు అయ్యేలా చర్యలు తీసుకున్నారని తెలిపారు. అయితే, మహిళా రిజర్వేషన్ బిల్లు త్వరగా అమలు అయ్యేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. మహిళా రిజర్వేషన్ బిల్లుపై అధ్యయనం చేసి బిల్లు త్వరగా అమలు అయ్యేలా చూస్తామని.. మహిళా రిజర్వేషన్ బిల్లుపై లోక్ సభలో 6 గంటల పాటు చర్చ ఉంటుందన్నారు. అంశాలపై విభేదాలు రావచ్చు ఏమో కానీఅన్ని పార్టీలు మహిళా రిజర్వేషన్ బిల్లుకు మద్దతు తెలుపుతాయనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు వైసీపీ ఎంపీ మిథున్‌రెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news