ఈమధ్యకాలంలో ఎక్కువ మంది వ్యాపారాన్ని చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. మీరు కూడా ఏదైనా వ్యాపారం చేయాలని అనుకుంటున్నారా..? అయితే మీకోసం ఈ బిజినెస్ ఐడియా. ఈ బిజినెస్ ఐడియాని కనుక మీరు ఫాలో అయితే కచ్చితంగా మంచిగా రాబడి వస్తుంది. అయితే మరి దీనికి సంబంధించి పూర్తి వివరాలు చూసేద్దాం.
ఈ మధ్య కాలంలో రైతులు పుదీనా సాగు చేసి మంచిగా లాభాలనే పొందుతున్నారు. ఒకసారి పెట్టుబడి పెడితే 5 నుండి 6 ఏళ్ళ పాటు దిగుబడి వస్తోంది. పుదీనా వంటి మంచి రుచిని ఇస్తుంది. చాలా మంది వంటలలో ఎక్కువగా పుదీనాని వాడుతూ ఉంటారు. పుదీనా సాగు చేస్తే మంచి ఫలితం ఉంటుంది. దీనికోసం మీరు ఐదు గుంటల భూమి విస్తీర్ణం తీసుకుంటే చాలు. దుక్కిని బాగా కలియదున్నాలి. పశువుల ఎరువుని 3 ట్రాక్టర్లు పోసి పదిహేను రోజులపాటు మగ్గబెట్టాలి. తర్వాత పుదీనా కాండాలను కత్తిరించిన తర్వాత విధంగా నాటాలి.
ఆకులు పెద్దవిగా వస్తూనే 30 రోజుల వ్యవధిలోనే దిగుబడి ప్రారంభమౌతుంది. రానున్న రోజుల్లో ఇది పెరుగుతూ ఉంటుంది. ఐదు నుండి ఆరు సంవత్సరాల పాటు ఇలా మీకు దిగుబడి వస్తూనే ఉంటుంది. మూడు రోజులకు ఒకసారి కేవలం అరగంట పాటు నీటిని అందిస్తే చాలు. అదేవిధంగా పురుగులు వంటివి లేకుండా చూసుకోవాలి అయితే ఈ పుదీనా సాగు చేయడానికి మీకు 18 వేల నుంచి 20 వేల వరకు ఖర్చు అవుతుంది.
ఇంత పెట్టుబడిని మీరు పెట్టుకుంటే కచ్చితంగా అద్భుతంగా రాబడి వస్తుంది. నెలకు ఇరవై రెండు వేల వరకు ఆదాయాన్ని పొందొచ్చు. అదే ఒకవేళ మీరు సుమారు అర ఎకరం విస్తీర్ణంలో ఈ పంట వేస్తే 80 వేల వరకు వస్తుంది. ఎలా చూసుకున్నా మంచిగా లాభాలు వస్తాయి. కాబట్టి పుదీనా సాగు తో మీరు మంచిగా రాబడి పొందొచ్చు.