మధ్యప్రదేశ్ లో అద్భుతం..కళ్ళు ఆర్పిన హనుమంతుడు.. వీడియో..

-

మధ్యప్రదేశ్ లో ఊహించని ఘటన వెలుగుచూసింది..ఓ ప్రముఖ ఆలయంలోని హనుమంతుడు విగ్రహం కళ్ళు ఆర్పడం అక్కడ ఉన్న కెమరాలకు చిక్కింది. ఇందుకు సంభందించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.. ఈ ఘటన రాష్ట్రంలోని ఖర్గోన్ జిల్లాలోని బద్వాహ్ సమీపంలోని ఓఖ్లా గ్రామంలో చోటుచేసుకుంది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట చక్కర్లు కోడుతుంది..

మధ్యప్రదేశ్‌లో ప్రసిద్ధ పుణ్యక్షేత్రాల్లో ఓఖ్లేశ్వర్ ధామ్ హనుమాన్ దేవాలయం ఒకటి. ఇది ఖర్గోన్ జిల్లాలో ఉంది. ఇది పురాతన ఆలయం. శనివారం గుడిలో దేవుడిని అలంకరిస్తుండగా హనుమంతుడి కళ్లు ఆర్పిన ఘటన కెమెరాకు చికినట్లు తెలుస్తోంది. దీనిని కొంత మంది తమ మెుబైల్ ఫోన్లలో బందించినట్లు తెలుస్తుంది..ఈ న్యూస్ కాస్తా వైరల్ గా మారడంతో ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఇది నిజంగా అద్భుతమని ఆలయ పూజారి చెబుతున్నారు. ఇక్కడ ఇలాంటి అద్భుతాలు ఇంతకముందు కూడా జరిగాయని స్థానికులు అంటున్నారు..

ఓఖ్లేశ్వర్ ధామ్‌లో హనుమాన్ జయంతితో సహా సంవత్సరంలో 13 సార్లు ఆంజనేయుడిని అలంకరిస్తారు. ప్రతినెలా 27వ తేదీన రోహిణి నక్షత్రం లో హనుమంతుడికి ఈ విధంగా చేస్తారు. ఈయనను దర్శించుకుంటే అన్ని కోరికలు నెరవేరుతాయని స్థానికులు చెబుతున్నారు..ఈ విషయం వైరల్ అవ్వడం తో ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఈ వింతను చూడటానికి వేల సంఖ్యలో భక్తులు వస్తున్నారు.. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ సిబ్బంది అన్ని రకాల చర్యలను తీసుకుంది.రేపు మంగళ వారం భక్తుల రద్దీ పెరిగే అవకాశం ఉందని ఆలయ సిబ్బంది అంటున్నారు.. ఆ అద్భుతమైన వీడియోను మీరు కూడా చూడండి..

 

Read more RELATED
Recommended to you

Latest news