రీ ఎంట్రీ కి సిద్ధమవుతున్న మీరాజాస్మిన్.. ఈసారి కాస్త ఘాటుగా..!!

-

వెండితెరకు ప్రత్యేకంగా పరిచయం అవసరంలేని అందాల తార మీరాజాస్మిన్.. దాదాపు 15 సంవత్సరాల క్రితం అబ్బాయిల కలల రాకుమారిగా నిలిచిన ఈమె తన నటనతో అల్లరి చేష్టలతో యువత మనసులను గిలిగింతలు పెట్టేది. తన నటనతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసిన ఈమె గ్లామర్ షో చేయకుండా సాంప్రదాయబద్ధంగా నటిస్తూనే మరింత పాపులారిటీ దక్కించుకుంది. ఎక్కువగా హీరోయిన్ పాత్రలు చేయడమే కాదు అంతకుమించి చెల్లెలు పాత్రలతో సెంటిమెంటు పండిస్తూ విపరీతంగా ఫ్యామిలీ ఆడియన్స్ కు కూడా దగ్గర అయింది మీరాజాస్మిన్.

చాలామంది తెలుగమ్మాయి అనుకునే ఈ మలయాళం నటి దాదాపుగా తెలుగు సినీ పరిశ్రమకు దూరమై దశాబ్ద కాలానికి పైగా అవుతుంది. ఇప్పుడు రీఎంట్రీ ఇవ్వడానికి తెగ ప్రయత్నం చేస్తున్న ఈ అమ్మడు సోషల్ మీడియాలో మునుపేన్నడు లేని విధంగా ఘాటుగా గ్లామర్ వలకబోస్తూ మరింత రచ్చ చేస్తోంది. ఉప్పొంగే ఎద అందాలు చూపిస్తూ నడుము వొంపులతో గిలిగింతలు పెట్టి మీరాజాస్మిన్ మళ్లీ సినిమాలలోకి ఎంట్రీ ఇవ్వాలని అభిమానులు సైతం ఎంతో ఆరాటపడుతున్నారు. ఈ క్రమంలోనే ఆమె రీఎంట్రీ కి సిద్ధమైనట్లు తెలుస్తోంది. అందుకోసం చాలా గ్రౌండ్ వర్క్ కూడా చేశారట. ఈసారి క్యూట్ గా కాకుండా కాస్త ఘాటుగా ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమవుతోందని సమాచారం.

త్వరలోనే తెలుగులో ఈమె నటించిన చిత్రం విడుదల కాబోతోందట. ఈ విషయాన్ని ఆమె స్వయంగా వెల్లడించింది. తాజాగా తన రోల్ , డబ్బింగ్ కి సంబంధించిన ఫోటోలు పంచుకోగా.. హీరో ఎవరు? దర్శకుడు ఎవరు? అనే వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది . ఏది ఏమైనా ఈసారి మీరాజాస్మిన్ భారీ విజయాన్ని సొంతం చేసుకునే దిశగా అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news