చీరకట్టులో సివంగి.. ‘దర్జా’గా రికార్డుల వేటలో అనసూయ..!

-

అనసూయ భరద్వాజ్.. ప్రజెంట్ అటు బుల్లితెర ఇటు వెండితెర రెండిటినీ ఏలుతున్నదని చెప్పొచ్చు. ఓ వైపు టెలివిజన్ షోస్ లో పార్టిసిపేట్ చేస్తూనే మరో వైపున ఫిల్మ్స్ లో కీ రోల్స్ ప్లే చేస్తోంది. తాజాగా ఆమె నెగెటివ్ రోల్ ప్లే చేసిన ‘దర్జా’ చిత్ర టీజర్ విడుదలైంది. అనసూయ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ చిత్రంలో పవర్ ఫుల్ కాప్ గా సునీల్ నటించాడు.

తాను చీర కట్టిన సివంగిని అంటూ అనసూయ చెప్పే డైలాగ్స్ టీజర్ లో ఆకట్టుకుంటున్నాయి. అనసూయను ఎదిరించే శక్తిమంతమైన పోలీస్ అధికారిగా సునీల్ కనిపించారు. సునీల్, అనసూయ మధ్య నడిచే ఆధిపత్య పోరులో కీలక పరిణామాలు ఎలా చోటు చేసుకుంటాయనేది స్టోరిగా ఉండబోతున్నదని టీజర్ చూస్తుంటే స్పష్టమవుతోంది.

మొత్తంగా ‘దర్జా’ టీజర్‌లో అనసూయ ప్రేక్షకులను ఈజీగానే అట్రాక్ట్ చేస్తోంది. లేడీ డాన్ కనకంగా అనసూయ వాయ్ లెంట్ లుక్ అదిరిపోయింది. తనను ఎదిరిస్తే బందరు కోట బద్ధలు కావాల్సిందే అని ఆమె చెప్పే డైలాగ్ బాగుంది. ఈ చిత్రాన్ని డాక్టర్ కామినేని శ్రీనివాస్ సమర్పిస్తుండగా శివశంకర్ పైడి పాటి ప్రొడ్యూస్ చేస్తున్నారు. సలీమ్ మాలిక్ దర్శకత్వం వహిస్తున్నారు.

అనసూయ నటించిన ‘ఖిలాడీ’ చిత్రం ఇటీవల విడుదలైంది. ఇది బాక్సాఫీసు వద్ద అనుకున్న స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. ఇందులో అనసూయ మోడ్రన్ గర్ల్ గా కనిపించగా, ‘దర్జా’లో చీరకట్టులో ఉండే కనకం అనే మహిళ పాత్రను పోషించింది. అనసూయ చిరంజీవి ‘ఆచార్య’ చిత్రంలోనూ నటించింది. ఆ సినిమా వచ్చే నెల 29న విడుదల కానుంది. క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ ‘రంగమార్తాండ’ పిక్చర్ లోనూ కీ రోల్ ప్లే చేసింది అనసూయ.

 

 

Read more RELATED
Recommended to you

Latest news