టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్ష వైసీపీ నేతలపై దాడులు దౌర్జన్యాలు చేసిన వాసన ఇంకా పోనట్లుంది..అందుకే అధికారం పోయినా టీడీపీ నేతలకు తలబిరుసు, దురుసుతనం, దాడులు, దౌర్జన్యాలు చేసే మనస్థత్వం ఇంకా పోలేదని నిరూపిస్తున్నారు. దాడులు దౌర్జన్యాలు చేయించడంలో టీడీపీ నేతలు ఎప్పుడైనా ముందుంటారు.. అయితే టీడీపీ నేతలు, కార్యకర్తలు చేసే దౌర్జన్యాలు, దాడులకు ప్రత్యక్షంగా, పరోక్షంగా మద్దతు ఇస్తుంది టీడీపీ అగ్రనాయకులే అనేది ఈ సంఘటన రుజువు చేస్తుంది. అధికారం పోయి ప్రతిపక్షంలోకి మారినా కూడా టీడీపీ నేతల తలబిరుసు ఏమాత్రం తగ్గలేదనడానికి, దీనికి అలాంటి పనుల్లో ఆరితేరిన మాజీ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు సపోర్టు చేడయం విశేషం.
ఇంతలా అచ్చెన్నాయుడు బరితెగించి దౌర్జన్యాలు చేస్తున్నవారికి సపోర్టు చేస్తూ ఇంకా ఏమీ తెలియని నంగనాచిలా అసెంబ్లీలో నా అంత సౌమ్యుడు ఎవరు లేరని ప్రగల్భాలు పలకడం విడ్డూరమే మరి. శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో వాలంటీర్‌పై టీడీపీ మాజీ ఎంపీటీసీ దాడి చేస్తే కూడా దాన్ని రాద్దాంతం చేయడం అచ్చెన్నాయుడి క్రూరమనస్థత్వం అద్దం పడుతుంది. టీడీపీ పింఛన్ దారులకు వైసీపీ ప్రభుత్వం ఇవ్వడం లేదన్నది టీడీపీ నాయకుడి ఆరోపణ. దీనికి వాలంటీర్‌తో గొడవ పడి అతడిపై చేయి చేసుకున్నాడు అచ్చెన్నాయుడి అనుచరుడు. దీనికి ఎమ్మెల్యే స్థాయిలో ఉన్న అచ్చెన్నాయుడు ఓ వాలంటీర్‌పై చేయి చేసుకున్న టీడీపీ నాయకుడిని మందలించాల్సింది పోయి.. అదే నాయకుడికి వత్తాసు పలుకుతూ తన కుటిల బుద్దిని బయటపెట్టుకున్నాడు.
వాలంటీర్‌పై దాడి చేసిన టీడీపీ నాయకుడిపై కేసు పెడితే అది తప్పంటూ ఇది వైసీపీ రాక్షసత్వానికి పరాకాష్ట అంటూ ఏకంగా పోలీసు స్టేషన్‌కు వెళ్లిన అచ్చెన్నాయుడు గాంధీ చిత్రం పటంతో నిరసన తెలుపడం అంటే హింసావాది అహింస ట్యాగ్ తగిలించుకున్నట్లు ఉంది. అచ్చెన్నాయుడి వ్యవహారం చూస్తుంటే వైసీపీ నేతలపై, కార్యకర్తలపై దాడులు చేయండి.. నేను గాంధీని అడ్డం పెట్టుకుని మిమ్మల్ని కాపాడుతా అన్నట్లుంది ఆయన వ్యవహారం. అయినా అచ్చెన్నాయుడిని అని ఏమి లాభం లేండీ. దూడ గట్టున మేస్తే లేగ పొలంలో మేయకుంటే ఏమి చేస్తది.. టీడీపీ అధినేత చంద్రాలు శవరాజకీయాలు చేస్తుంటే.. ఆయన అనుచరులు మాత్రం ఈ మాత్రం చేయరా ఏంటీ… ఎంతైనా గురువు బాటలో శిష్యుడు..