రైతులకి కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని మాజీ ఎమ్మెల్యే ఆల అన్నారు శనివారం దేవరకద్ర నియోజకవర్గ కేంద్రంలో నిర్వహించిన విఆర్ఎస్ రైతు దీక్షలో ముఖ్య అతిథిగా ఆయన పాల్గొన్నారు రైతులకి కాంగ్రెస్ ఇచ్చిన హామీలు రెండు లక్షల రైతు రుణమాఫీ రైతుబంధు 15000 వడ్లకి మొక్కలకు 500 రూపాయలని బోనస్ రైతు కూలీలకి 12000 రూపాయలు కౌలు రైతులకి 15000 ఇస్తామని చెప్పిన హామీలలో ఏ ఒక్కటి కూడా అమలు చేయలేదని అన్నారు.
కరెంటు లేక నీళ్లు లేక పంట నష్టపోయిన రైతులకి ఎకరాకి 25వేల నష్టపరిహారం ఇవ్వాలని అన్నారు. కాంగ్రెస్ వచ్చింది కరువు వచ్చిందని అన్నారు. మొద్దు ప్రభుత్వాన్ని నిద్ర లేపడానికి రైతు దీక్షలు చేస్తున్నారని చెప్పారు వందరోజుల కాంగ్రెస్ పాలనలో 200 మంది రైతులు చనిపోయారని వాళ్ళ కుటుంబానికి సహాయం చేయలేదని ఏ మంత్రి కానీ ఎమ్మెల్యే కానీ పరామర్శించడం లేదని అన్నారు ఎండిన పంట పొలాలని చూడడానికి కూడా రావట్లేదని అన్నారు.