కాంగ్రెస్‌పై జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు : ఇది ఏమైనా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ నా ?

-

కాంగ్రెస్‌ పార్టీ పై ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ సమావేశాల నేపథ్యం లో ఇవాళ కాంగ్రెస్‌ సీఎల్పీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పార్టీ ముఖ్య నాయకుల మధ్య అవేశం తో ఊగిపోయారు జగ్గారెడ్డి. ఇది కాంగ్రెస్ పార్టీ నా… ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ నా .? అంటూ వివాదస్పద వ్యాఖ్యలు చేశారు.

చర్చ లేకుండా నే… రెండు నెలల కార్యాచరణ ఎలా ప్రకటిస్తారు..? జహీరాబాద్ లో క్రికెట్ మ్యాచ్ విషయం కనీసం గీత రెడ్డీ కి సమాచారం ఇవ్వరా..? అని తెలంగాణ అధిష్టానంపై నిప్పులు చెరిగారు. సంగారెడ్డి జిల్లా కి వస్తే… వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న నాకే సమాచారం ఇవ్వారా .? అని నిలదీశారు.

”కనీస ప్రో టో కాల్ పాటించాలి కదా..? నాకు సమాచారం ఇవ్వకపోవడం అంటే… నాకు..రేవంత్ కి వివాదం ఉందని చెప్పాలని అనుకుంటున్నడా..?” అంటూ ఫైర్‌ అయ్యారు. కాంగ్రెస్ లో ఏ ఒక్కరో హీరో కాలేరని చురకలు అంటించారు. రేవంత్ రెడ్డి.. పీసీసీ చీఫ్‌ కాక ముందే.. తాను మూడు సార్లు ఎమ్మెల్యేనని గుర్తు చేశారు జగ్గారెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news