ఫ్యాక్షన్ ప్రభావిత జిల్లాలో లోకేష్ రెచ్చగొట్టి వెళ్లిపోతున్నారు : ఎమ్మె్ల్యే కేతిరెడ్డి

-

లోకేష్ ఆరోపణల మీద ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నా పేరుతో భూములు కబ్జా చేసి ఉంటే వారిని చెప్పుతో కొట్టండని ఆయన అన్నారు. అది అబద్ధమని తేలితే మిమ్మల్ని దేనితో కొట్టాలని ఎమ్మెల్యే కేతిరెడ్డి వ్యాఖ్యానించారు. ఊర్లో ఉన్న భూములన్నీ నావే అంటూ లోకేష్ చెబుతున్నారని, ముందు చెరువు కబ్జా అన్నారు.. తర్వాత 45 ఎకరాలు అన్నారన్నారు. 2014 గూగుల్ మ్యాప్ చూపించి నమ్మించాలని చూశారని ఆయన మండిపడ్డారు. ముదిగుబ్బలో నా అనుచరులు కబ్జా చేసి ఉంటే.. వారు ఎక్కడైనా సంతకం పెడతారని, ఆ భూములు మీరే తీసుకోండని ఆయన సవాల్‌ చేశారు.

Dharmavaram MLA reacts to Lokesh's allegations - The Hindu

ప్రభుత్వ భూములు కబ్జా కాకుండా బోర్డులు పెట్టించిందే నేను అని ఆయన తెలిపారు. నా పేరు ఎక్కడైనా ఉపయోగిస్తే ఈడ్చి కొడతానని బహిరంగంగా చెప్పానని, ఫ్యాక్షన్ ప్రభావిత జిల్లాలో లోకేష్ రెచ్చగొట్టి వెళ్లిపోతున్నారని ఎమ్మెల్యే కేతిరెడ్డి ధ్వజమెత్తారు. పాదయాత్రలో ఎప్పుడైనా ప్రజా సమస్యలను ప్రస్తావించారా.. ప్రజల వద్దకు వెళ్లారా అని ఎమ్మెల్యే కేతిరెడ్డి ప్రశ్నించారు. ఎన్టీఆర్, బాలకృష్ణ డైలాగ్స్ చదివి వినిపించిన ఎమ్మెల్యే కేతిరెడ్డి.. వీటిని చూసి ఒక్కసారైనా స్పష్టంగా చెప్పగలవా… అప్పుడు నమ్ముతారు నిన్ను అని వ్యాఖ్యానించారు. పరిటాల శ్రీరామ్ ఏమైనా కాశిరెడ్డి నాయన ఆశ్రమం నుంచి వచ్చారా.. వారు అనంతపురం, రాప్తాడులో చేసిన దౌర్జన్యాలు అందరికీ తెలుసు అని ఆయన అన్నారు. శ్రీరామ్ కు టికెట్ కన్ఫామ్ అయిన నేపథ్యంలో ఆల్ ది బెస్ట్ చెప్పిన కేతిరెడ్డి.. గ్రౌండ్ వర్క్ చేసుకో, వాస్తవాలు ఏంటో తెలుసుకో, ఎవరో చెప్పినవి వినద్దు అంటూ సలహాలు ఇచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news