బండికి అండగా బీజేపీ..పట్టు వదలకుండా పోరాటం..!

-

తెలంగాణ రాజకీయాల్లో వరుస పేపర్ల లీకేజ్ సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే…టి‌ఎస్‌పి‌ఎస్‌సి పేపర్లు లీక్ అవ్వడం, దాని వెనుక టెన్త్ పేపర్లు లీక్ కావడంతో కే‌సి‌ఆర్ సర్కారుపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. అయితే ఈ పేపర్ల లీకులో ఊహించని విధంగా కుట్ర ఉందని, టెన్త్ పేపర్ల లీకులో బి‌జే‌పి నేతల హస్తం ఉందని, కావాలని కొందరు టీచర్ల ద్వారా పేపర్లు లీకు చేయించి కే‌సి‌ఆర్ సర్కారుని బద్నామ్ చేయాలని చూశారని చెప్పి బి‌ఆర్‌ఎస్ పార్టీ నేతలు..బి‌జే‌పి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ని టార్గెట్ చేశారు.

అలాగే పోలీసులు సైతం ఈ కేసులో బండిని ఏ1 గా పెట్టి అరెస్ట్ చేశారు. అలాగే ఆయన ఇప్పుడు రిమాండ్ లో ఉన్నారు. టెన్త్ పేపర్ల లీక్ వెనుక బండి హస్తం ఉందని ఆరోపణలు వస్తున్నాయి. అయితే ఇలా ఒక్కసారిగా బండిపై బి‌ఆర్‌ఎస్ రాజకీయంగా రివర్స్ ఎటాక్ చేయడంతో సీన్ మారింది. అయితే బి‌ఆర్‌ఎస్ చేస్తున్న రాజకీయ దాడిని బి‌జే‌పి నేతలు సమర్ధవంతంగా తిప్పికొడుతున్నారు. బండి కోసం రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు తెలియజేస్తున్నారు.

ప్రతి బి‌జే‌పి నేత బండికి అండగా మాట్లాడుతూ..దీని వెనుక బి‌ఆర్‌ఎస్ కుట్ర ఉందని ఫైర్ అవుతున్నారు.  బండి సంజయ్‌ కు రాష్ట్రం మొత్తం అండగా ఉంటుందని, సంజయ్‌ను అరెస్టు చేసినంత మాత్రాన పోరాటాలు ఆగవని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. అటు ఈటల రాజేందర్, రఘునందన్, డీకే అరుణ..ఇతర బి‌జే‌పి నేతలు బండికి అండగా నిలబడ్డారు.

ఒకవేళ బి‌జే‌పి నేతలు, శ్రేణులు ఇలా బండికి గాని అండగా నిలబడకుండా ఉండే వచ్చిన ఆరోపణలు నిజమని ప్రజలు అనుకునే పరిస్తితి ఉంది. కానీ ఇప్పుడు సపోర్ట్ గా నిలబడి పోరాటం చేయడం బండికి ధైర్యాన్ని ఇస్తుందనే చెప్పాలి.

Read more RELATED
Recommended to you

Latest news