నల్గొండ జిల్లా మునుగోడు నియోజకవర్గానికి ఇటీవల జరిగిన ఉప ఎన్నికలలో అధికార టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత కోసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి సోమవారం తొలిసారిగా మునుగోడు కు వచ్చారు. ఈ నేపథ్యంలో టిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో విజయోత్సవ ర్యాలీ చేపట్టారు.
ఈ సందర్భంగా కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ.. మునుగోడు నియోజకవర్గాన్ని కనివిని ఎరుగని రీతిలో అభివృద్ధి చేసి మునుగోడు ప్రజల రుణం తీర్చుకుంటానని హామీ ఇచ్చారు. తనపై నమ్మకముతో గెలిపించిన ప్రజలకు జీవితాంతం రుణపడి ఉంటానని స్పష్టం చేశారు. ఎన్నికలలో ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తామన్నారు. తనని ఓడించాలని బిజెపి ఎన్ని కుట్రలు చేసిన ప్రజల ఆశీర్వాదం మాత్రం తనకే దక్కిందని చెప్పారు. రాబోయే రోజులలో చండూర్, చౌటుప్పల్ మున్సిపాలిటీల రూపురేఖలు మార్చివేస్తానని అన్నారు. పెండింగ్ లో ఉన్న పనులు పూర్తిచేసి కొత్త పనులు తీసుకొస్తారని చెప్పారు.