కారు-కమలం కౌంటర్ పాలిటిక్స్..ఎన్నికలే టార్గెట్..!

-

తెలంగాణలో టి‌ఆర్‌ఎస్-బి‌జే‌పిల మధ్య రాజకీయ యుద్ధం తీవ్ర స్థాయిలో నడుస్తున్న విషయం తెలిసిందే. నెక్స్ట్ ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి రావడానికి రెండు పార్టీలు వ్యూహ-ప్రతివ్యూహాలతో ముందుకెళుతున్నాయి. రాజకీయంగానే కాదు..వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ రెండు పార్టీలు రాజకీయం నడుపుతున్నాయి. ఒక పార్టీ ఒక ఎత్తు వేస్తే…మరొక పార్టీ మరొక ఎత్తుతో ముందుకొస్తుంది. పూర్తిగా రాజకీయ పరమైన కక్షతోనే ముందుకెళుతున్నాయి.

ఇటీవల ఢిల్లీ లిక్కర్ స్కామ్, ఎమ్మెల్యేల ఎర కేసులు నడుస్తున్న విషయం తెలిసిందే. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ని అడ్డం పెట్టుకుని బీజేపీ, టి‌ఆర్‌ఎస్‌ని గట్టిగా టార్గెట్ గా చేస్తుంది…ఇప్పటికే కవిత ఆ స్కామ్ లో ఉందని ప్రచారం చేశారు. అలాగే పలువురి అరెస్టులు జరిగాయి. ఇక ఈడీ, ఐటీ దాడులు జరుగుతున్నాయి. టి‌ఆర్‌ఎస్ లో వ్యాపారం చేస్తున్న నేతల లక్ష్యంగా అవి జరుగుతున్నాయి. ఇటీవల మంత్రి గంగుల గమలాకర్, ఎంపీ వద్దిరాజుల వ్యాపారాలపై ఐటీ, ఈడీ దాడులు జరిగాయి.

ఇక బీజేపీకి కౌంటరుగా కేసీఆర్..ఎమ్మెల్యేలకు ఎర కేసుని తెరపైకి తీసుకొచ్చారు. బీజేపీకి చెందిన ముగ్గురు వ్యక్తులు, టి‌ఆర్‌ఎస్ కు చెందిన నలుగురు ఎమ్మెల్యేలని కొనుగోలు చేయడానికి ప్రయత్నించిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఆ కేసులో ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇంకా విచారణ కొనసాగుతుంది. ఈ సమయంలోనే టి‌ఆర్‌ఎస్ నేతలపై ఐటీ, ఈడీ దాడులు జరగడంతో టి‌ఆర్‌ఎస్ రివర్స్ అయింది.

ఎమ్మెల్యే ఎర కేసులో పట్టుబడిన నందకుమార్‌కు సంబంధించిన అక్రమ కట్టడాలని కూల్చివేసే పనిలో టి‌ఆర్‌ఎస్ ప్రభుత్వం ఉంది. అలాగే ఈ కేసుకు సంబంధించి ఇతర రాష్ట్రాల్లో ప్రమేయం ఉన్నవారిని సైతం విచారించడమే లక్ష్యంగా ముందుకెళుతున్నారు.  కేసు దర్యాప్తును ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) ముమ్మరం చేసింది. దేశవ్యాప్తంగా ఏడు బృందాలతో సెర్చ్‌ ఆపరేషన్‌ నిర్వహిస్తోంది. తెలంగాణతోపాటు ఫరీదాబాద్‌, కేరళ మరికొన్ని ప్రాంతాల్లో ఈ సోదాలు జరుగుతున్నాయి. ఇలా టి‌ఆర్‌ఎస్‌కు బి‌జే‌పి..బి‌జే‌పికి టి‌ఆర్‌ఎస్ రాజకీయంగా కౌంటర్లు ఇచ్చుకుంటుంది. ఎన్నికల వరకు ఈ తతంగం కొనసాగేలా ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news