సమస్యలపై నిర్లక్ష్యం.. మున్సిపల్ ఆఫీసులో నిద్రపోయిన ఎమ్మెల్యే

-

పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు మున్సిపల్ కార్యాలయంలో ఎమ్మెల్యే రామానాయుడు నిరసన చేపట్టారు. పాలకొల్లు పట్టణంలోని ప్రజలకు తాగునీరు, వీధిదీపాలు, అపరిశుభ్ర పరిస్థితులు లాంటి సమస్యలపై అధికారులు పట్టించుకోవడం లేదంటూ వ్యాఖ్యానించారు. ఈ విష‌యాల‌పై మాట్లాడేందుకు శుక్రవారం మున్సిపల్ కార్యాలయానికి వెళ్లారు. ఐతే.. అక్కడ అధికారులు లేకపోవడం, మిగతా వారు కూడా సరైన విధంగా స్పందించలేదని కలెక్టర్‌కు లేఖ రాశారు. అనంతరం రోజంతా అక్కడే ఉండి నిరసన తెలిపారు.

ఈ క్ర‌మంలోనే మున్సిపల్ కమిషనర్ కార్యాలయం బయట ఎమ్మెల్యే నిమ్మల రాత్రంతా నిద్రపోయారు. ఉదయాన్నే మున్సిపల్ ఆఫీస్ బయటే స్నానం చేసి నిరనస తెలిపారు. ఇంత జరిగినా అధికారులు ఎవరూ వచ్చి మాట్లాడకపోవడం బట్టి చూస్తే ప్రభుత్వానికి ప్రజాసమస్యల పరిష్కారంలో ఎంత చిత్తశుద్ధి లేదని ఆయన వ్యాఖ్యానించారు. వ్యర్ధ పదార్ధాలు క్లీన్ చేయని కారణంగా డెంగీ వంటి రోగాలు ప్రబలి ప్రజలు రోగాల బారిన పడుతున్నారని ఆయన ఆరోపించారు.

Read more RELATED
Recommended to you

Latest news