ఆ చిన్నారి ప్రాణాలు కాపాడిన జగన్..!

-

సీఎం జగన్‌ ఓ ఇంటి దీపాన్ని నిలెబెడుతున్నారు. ఓ చిన్నారి ప్రాణానికి ఊపిరిపోస్తున్నారు. వైద్యం చేయించే స్థోమత లేక.. మా పాప కారుణ్య మరణానికి అనుమతివ్వమంటూ వేడుకున్న ఓ నిరుపేద దంపతుల మొర ఆలకించారు. ఆ పాప దీనగాధకు సంబంధించి మీడియాలో వచ్చిన కథనాలకు చలించిపోయారు. పాప వైద్యానికి అవసరమైన డబ్బు సీఎం సహాయనిధి నుంచి ఇవ్వాలని అధికారులను ఆదేశించారు.

వివరాల్లోకి వెళ్తే.. చిత్తూరు జిల్లా బి.కొత్తకోట బీసీ కాలనీకి చెందిన బావాజాన్, షబానాకు ఎనిమిదేళ్ల క్రితం వివాహం అయింది. గతంలో ఈ దంపతులకు పుట్టిన ఇద్దరు పిల్లలు జన్మించిన కొద్ది రోజుల వ్యవధిలోనే షుగర్‌ స్ధాయి పడిపోవడంతో చనిపోయారు. ఏడాది క్రితం మరో పాప జన్మించింది. ఆ పాపకు సుహానా అని పేరు పెట్టుకున్నారు. అయితే భయపడినట్టే జరిగింది.

ఈ పాపకు కూడా షుగల్ లెవల్స్ చాలా తక్కువగా ఉన్నాయి. పాపను బతికించుకోవడం కోసం అప్పులు చేసి మరీ వైద్యం చేయిస్తూ వస్తున్నారు. వారి ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే కావడంతో సుహానాకు వైద్యం అందించడం వారి స్థాయికి మించిన పని అవుతోంది. అందుకే చిన్నారి కారుణ్య మరణానికి అనుమతించాలంటూ తల్లిదండ్రులు కోర్టును ఆశ్రయించారు.

ఈ విషయం మీడియాలో ప్రముఖంగా వచ్చింది. దీంతో సీఎం జగన్‌ స్పందించి చర్యలకు ఆదేశించారు. చిన్నారి ఆరోగ్యం గురించి చిత్తూరు జిల్లా కలెక్టర్‌తో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. సుహానా చికిత్సకు అవసరమయ్యే ఖర్చును సీఎం సహాయనిధి నుంచి విడుదల చేయాలని ఆదేశాలు జారీ చేశారు. చిన్నారికి రోజువారీగా అవసరమయ్యే ఇన్సులిన్‌ను ప్రభుత్వ ఆసుపత్రి నుంచే ఉచితంగా అందించాలని స్పష్టం చేశారు. ఎప్పటికప్పుడు ఆమె ఆరోగ్య స్థితిని పర్యవేక్షించాలని సీఎం అధికారులకు చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news