తెలంగాణాలో అసెంబ్లీ ఎన్నికలు జరగడానికి ఇంకా కొద్దికాలం మాత్రమే సమయం ఉంది. దీనితో రాజకీయ పార్టీలు అన్నీ కూడా తమ అభ్యర్థులను ప్రకటించే పనిలో పడ్డారు. ఇక అధికార BRS సైతం ఇప్పటికే కొన్ని చోట్ల తమ ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించడంతో పార్టీలో ముసలం మొదలైంది. గత కొంతకాలంగా స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే గా ఉన్న రాజయ్య మహిళా సర్పంచ్ వివాదంలో మునగడంతో, ఇతనికి టికెట్ ఇచ్చే అవకాశాలు దాదాపు లేనట్లేనని వార్తలు ఊపందుకున్నాయి. తాజాగా ఎమ్మెల్యే రాజయ్య మీడియా తో తనకు టికెట్ వస్తుందా రాదా అన్న విషయం పై క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. రాజయ్య మాట్లాడుతూ నేను కష్టాల్లో ఉన్నప్పుడల్లా నాకు నా కమ్యూనిటీ అండగా నిలిచింది, నేను ఎన్నో కష్టాలను ఎదుర్కొని ప్రజల అండదండలతో ఎమ్మెల్యేగా ఉన్నానన్నారు.
BRS అధిష్టానం ఖచ్చితంగా నా శ్రమను గుర్తించి వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడానికి అవకాశం ఇస్తుందని బలంగా నమ్ముతున్నట్లు చెప్పారు రాజయ్య. మరి ఈయన మోర కేసీఆర్ వింటారా ?