గోవాలో ఫ్యామిలీతో క‌లిసి ఎంజాయ్ చేస్తున్న ఎమ్మెల్యే రోజా..

-

నగరి ఎమ్మెల్యే, ఏపీఐఐసి చైర్మన్ ఆర్కే రోజా తన కుటుంబంతో కలిసి గోవా పర్యటనలో ఉన్నారు. కుటుంబంతో కలిసి టూర్‌‌లో ఉన్నారు ఈమె. ఈ ఈ విషయాన్ని తన సోషల్ మీడియా ఖాతాల్లో వెల్లడించిన ఆమె, ఎయిర్ పోర్టు, గోవాలో తీసుకున్న సెల్ఫీ ఫోటోలను అభిమానులతో పంచుకున్నారు. ఈ శీతాకాలంలో గోవా టూర్ కు వెళుతున్నట్టు ఆమె ఇటీవలే వెల్లడించిన సంగతి తెలిసిందే.

న్యూ ఇయర్ వేడుకలను రోజా ఫ్యామిలీ, గోవాలోనే జరుపుకుంటుందని తెలుస్తోంది. ప్ర‌స్తుతం రోజా పోస్ట్ చేసిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. వాటిపై మీరూ ఓ లుక్కేసేయండి. కాగా, ప్రస్తుతం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న రోజా.. 2004,2009 శాసనసభ ఎన్నికలలోనగరి, చంద్రగిరి నియోజకవర్గాల నుంచి పోటీచేసి ఓడిపోయారు. 2014 శాసనసభ ఎన్నికలలోనగరి నియోజకవర్గం నుంచి పోటీచేసి తన సమీప అభ్యర్థి గాలి ముద్దుకృష్ణమనాయుడుపై 858 ఓట్ల తేడాతో గెలుపొందారు.

Read more RELATED
Recommended to you

Latest news